Share News

తుంగభద్ర నదిలో మహిళ మృతదేహం లభ్యం

ABN , Publish Date - Nov 09 , 2024 | 11:13 PM

అలంపూరు తుంగభద్ర నదిలో శనివారం మధ్యాహ్నం మహిళ మృతదేహం లభ్యమైంది.

 తుంగభద్ర నదిలో మహిళ మృతదేహం లభ్యం

అలంపూరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): అలంపూరు తుంగభద్ర నదిలో శనివారం మధ్యాహ్నం మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన హారికగా గుర్తించినట్టు ఉండవెల్లి ఎస్‌ఐ మహేష్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం బొంకూరు గ్రామం నుంచి తప్పిపోయినట్లుగా వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. మరునాడు ఉదయం నదిలో శవంగా తేలింది. మృత దేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 11:13 PM