ఇసుక రవాణాలో తెగని సరిహద్దు పంచాయితీ..
ABN , Publish Date - Dec 19 , 2024 | 11:48 PM
తుంగభద్ర నదిలో నుంచి ప్రభుత్వ అనుమతులుతో తరలిస్తున్న ఇసుకకు సరిహద్దు పంచాయితీ మరోసారి చెలరేగింది.
మరోసారి అడ్డుకున్న ఏపీ పోలీసులు
హద్దులను ఏర్పాటు చేయాలంటున్న తూర్పు గార్లపాడు గ్రామస్థులు
రాజోలి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : తుంగభద్ర నదిలో నుంచి ప్రభుత్వ అనుమతులుతో తరలిస్తున్న ఇసుకకు సరిహద్దు పంచాయితీ మరోసారి చెలరేగింది. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని తూర్పు గార్లపాడు శివారులోని తుంగభద్ర నదిలో ఇసుక తరలించేందుకు ‘మన ఇసుక వాహనం’ పథకానికి అనుమతులు ఉన్నాయి. అయినా ఏపీ పోలీసులు, అటుగా ఉన్న కొంతలపాడు గ్రామస్థులు అడ్డుపడుతూనే ఉన్నారు. జూన్ 21న సరిహద్దు దాటకుండా తెలంగాణ హ ద్దుల్లోనే ఇసుకను తరలిస్తుంటే ఏపీ అధికార యంత్రాంగం తెలంగాణకు సంబంధించిన ఇసుక ట్రాక్టర్లను అదు పులోకి తీసుకున్నారు. ఉన్నతాధికారుల చర్చలు జరపడంతో ఒక్కొక్క ట్రాక్టర్‌కు రూ. 5 వేలు చొప్పున మొ త్తం 64 ట్రాక్టర్లకు జరిమానా వేసి వదిలేశారు. గురువారం మరోసారి అలాంటి పరిస్థితి ఎదురైంది. తూర్పు గార్లపాడు శివారులో ఇసుక కోసం ‘మన ఇసుక వాహనం’ ట్రాక్టర్లు గురు వారం నదిలోకి దిగితే మళ్లీ ఏపీ పోలీసులు, కొంతల పాడు గ్రామస్థులు అడ్డుకున్నారు. అనంతరం రాజోలి పోలీ సులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ జగదీశ్వర్, పోలీస్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరు కుని ట్రాక్టర్ మీదుగా నదిలోకి వెల్లి బార్డురును పరిశీ లించారు. గూగుల్ మ్యాప్‌లో పరిశీలిస్తే ఇది తెలంగాణ బార్డరులోనే ఉందని, ఏపీ బార్డరు కాదని చెప్పడంతో ఏపీ వారు వెనుతిరిగి వెళ్లారు. త్వరలో జిల్లా అధికారులు వచ్చి నదిలో సరిహద్దును ఏర్పాటు చేస్తారని ఎస్‌ఐ జగదీశ్వర్ తెలిపారు. ఇదిలా ఉండగా తుమ్మిళ్ల శివారులోని తుంగభద్రకు అటువైపుగా ఉన్న సంగాల గ్రామం శివారులో ఏపీ ప్రభుత్వం తెలంగా ణ బార్డరుకు వచ్చి ఇసుకను తోడేస్తుంటే అధికారులు స్పందించడం లేదని, తెలంగాణ సరిహద్దులోనే ఇసు కను తరలిస్తుంటే ఏపీ పోలీసులు అడ్డుపడుతున్నా రని తూర్పు గార్లపాడు గ్రామస్థులు, ట్రాక్టర్ యజ మానులు ఆరోపిస్తున్నారు.