Share News

డిసెంబరు 7 వరకు సంక్షేమ పథకాలపై ప్రచారం

ABN , Publish Date - Nov 19 , 2024 | 11:26 PM

రాష్ట్రంలో ప్రజాపాలన ఏడాది పూర్తైన సందర్భంగా ఈ ఏడాదిలో అమలైన సం క్షేమ, అభివ్రుద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల నే లక్షంగా ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్స వాలను నిర్వహించాలని నిర్ణయించింది.

డిసెంబరు 7 వరకు సంక్షేమ పథకాలపై ప్రచారం

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, నవంబరు 19, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజాపాలన ఏడాది పూర్తైన సందర్భంగా ఈ ఏడాదిలో అమలైన సం క్షేమ, అభివ్రుద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల నే లక్షంగా ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్స వాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకో సం ప్రభుత్వం తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాబృందాల ద్వారా ఈనెల 19 నుంచి వచ్చేనెల డిసెంబరు 7 వరకు ప్రజా విజ యోత్సవాల కార్యక్రమాలను నిర్వహించనుంది. కార్యక్రమంలో భాగంగానే మంగళవారం సమీకృ త జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో ప్రజాపాలన కళాయాత్ర వాహనాన్ని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక కళాకారు లు ఈనెల 19 నుంచి డిసెంబరు 7 వరకు ప్రతీ రోజు మూడు గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథ కాలపై ప్రచారం గావించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీపీఆర్‌వో శ్రీనివాసులు, కలెక్టరేట్‌ కార్యాలయ పరిపాలన అధికారి శంకర్‌, తెలంగా ణ సమగ్ర శిక్షా సి.ఎం.వో బాలు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 11:26 PM