కులగణన రాత్రికిరాత్రి వచ్చింది కాదు
ABN , Publish Date - Nov 06 , 2024 | 11:13 PM
కులగణన పక్రియ రాత్రికి రాత్రి వచ్చిన ఆలోచన కాదని, దీని వెనుక శ్రమ, పోరాటాలు, కుట్రలు, అడ్డుకట్టలెన్నో ఉన్నా ఈనాడు కులగణన ప్రక్రియ మొదలుకావడం సం తోషకరమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
- అలంపూర్‌లో ప్రారంభమైన చైతన్యయాత్ర
అలంపూర్ చౌరస్తా/గద్వాల టౌన్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : కులగణన పక్రియ రాత్రికి రాత్రి వచ్చిన ఆలోచన కాదని, దీని వెనుక శ్రమ, పోరాటాలు, కుట్రలు, అడ్డుకట్టలెన్నో ఉన్నా ఈనాడు కులగణన ప్రక్రియ మొదలుకావడం సం తోషకరమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం అలంపూర్ నుంచి కులగణన చైతన్య యా త్ర మొదలు పెట్టారు. ముందుగా సంఘం నాయకులతో వచ్చిన ఆయన ఆలయాలను దర్శిం చుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ 1831 తర్వాత భారతదేశంలో కులగణన చేయాలని బీసీ కులా లు పొరాడుతున్నాయన్నారు. తాము కుడా ఎన్నో పొరాటాలు చేశామని, హైకోర్టుకెళ్లామని, ఢిల్లీలో పొరాటాలు చేశామని అయినా కులగణనను కొందరు సైంధవుల్లా అడ్డుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బీసీ కులాల్లో ఆనందం వ్యక్తమౌతోందన్నారు. అందుకే ఈ యాత్ర దిగ్వి జయంగా జరగాలని అమ్మవారిని దర్శించుకున్న ట్లు తెలిపారు. బుధవారం మొదలైన యాత్ర అన్ని జిల్లాల గుండా సాగి ఈ నెల 20న ఆదిలా బాద్‌లో ముగుస్తుందని చెప్పారు. సమగ్ర కుల గణన సర్వేలో అందరూ పాల్గొని, తమ కులమేంటో చెప్పాలని, దీని వల్ల భవిష్యత్‌లో రాజకీ యంగా, విద్యాపరంగా, సంక్షేమ పథకాలతో పాటు దామాషా ప్రకారం ఉద్యోగావకాశాలు, రిజర్వే షన్లు లభిస్తాయని అన్నారు. ఎన్యుమరేటర్లు ఎలాంటి పొరపాట్లు చేయరాదని సూచించారు. ఇక్కడ జరిగే సర్వే దేశానికే రోల్‌మోడల్ కావాలని అన్నారు. అంతకుముందు గద్వాల పట్టణంలోని వాల్మీకి భవనంలో నిర్వహించిన బీసీ కుల సంఘాల సమావేవానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పూడూరు అచ్చన్నగౌడ్‌తో కలిసి పాల్గొని మాట్లాడారు. ఇంటింటి సర్వే కోసం వచ్చే అధికారుల బృందానికి కులం వివరాలు స్పష్టంగా తెలపాలన్నారు. యాత్రలో ఆలయ మాజీ చైర్మన్ చిన్న కృష్ణయ్య, బీసీ కుల సంఘాల జే ఏసీ రాష్ట్ర కన్వీనర్ బాలరాజ్ గౌడ్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్‌కొండ, విక్రం, నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, వైండింగ్ రాములు, మల్లయ్య, వినోద్, వాల్మీకి, ఎండీ సుభాన్, గోపాల్‌రావు, సాదతుల్లా, ప్రభాకర్, కోళ్ల హుసేన్, జ్యోతి, ఆంజనేయులు, సీసల వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.