Share News

కులగణన సర్వే పారదర్శకంగా చేపట్టాలి

ABN , Publish Date - Nov 13 , 2024 | 11:06 PM

ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఇంటింటి సర్వేను పూర్తి పాదర్శకంగా చేపట్టాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా కార్యదర్శి అశోక్‌ కోరారు.

కులగణన సర్వే పారదర్శకంగా చేపట్టాలి
ధరూరు తహసీల్దార్‌ మంగమ్మకు వినతిపత్రం ఇస్తున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

గద్వాల టౌన్‌/ధరూరు/వడ్డేపల్లి/రాజోలి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఇంటింటి సర్వేను పూర్తి పాదర్శకంగా చేపట్టాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా కార్యదర్శి అశోక్‌ కోరారు. సర్వే బృందాన్ని తప్పుదోవ పట్టించేలా కొంతమంది తప్పుడు సమాచారం ఇచ్చే ప్రమాదం ఉన్నందున ఎన్యుమరేటర్లకు తగిన ఆదేశాలు ఇవ్వాలన్నారు. బుధవారం ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో నాయకులు తహసీల్దార్‌ మల్లికార్జున్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్వాల మండల పరిధిలో కొందరు తాము ఎస్సీ జాబితాలో ఉన్న మాదిసి, మాదారి కురువలమని అధికారులను తప్పుదోవ పట్టిస్తూ అక్రమ మార్గంలో ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రస్తుత కులగణనలో కూడా ఇదే తంతు కొనసాగుతందని, అలాంటి తప్పిదాలకు తావు లేకుండా పాదర్శకంగా కులగణన చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మోషన్న, కన్న, ఆంజనేయులు, రంజిత్‌, తిమోతి, రాములు, ప్రవీణ్‌, కృష్ణస్వామి ఉన్నారు. అదే విధంగా ధరూరు తహసీల్దార్‌ మంగమ్మకు ఎమ్మార్పీఎస్‌ నాయకులు చిన్నపాడు ఆంజనేయులు, చింతరేవుల ఆంజనేయులు, నర్సింహులు, డ్యాం అంజి, తిమ్మప్ప వినతిపత్రం అందజేయగా, వడ్డేపల్లిలో ఎమ్మార్పీఎస్‌ జాతీయ నాయకుడు కొంకల భీమన్న మాదిగ, ఎంఎస్‌పీ జిల్లా కన్వీనర్‌ రాజు మాదిగ తహసీల్దార్‌ ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రాజోలి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్‌ జాతీయ నాయకులు కొంకల భీమన్న ఆధ్వర్యంలో తహసీల్దార్‌ రామ్మోహన్‌కు వినతి పత్రం అందజేశారు. వడ్డేపల్లి ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు ఏసేపు, ఎంఎస్‌ఎఫ్‌ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌, ధనుంజయ, రాజోలి మండల అధ్యక్షుడు రాజాబాబు, రమణ, దేవన్న, గోవిందు, రాజు ఉన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 11:06 PM