అన్ని మునిసిపాలిటీలకు కేంద్రం నిధులు
ABN , Publish Date - Dec 07 , 2024 | 11:21 PM
కేంద్రం ప్రభుత్వం అన్ని మునిసిపాలిటీలకు సమానంగా నిధులు మంజూరు చేస్తుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆరో వార్డులో టీయూఎఫ్‌ఐడీసీ(తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ర్ఫాస్ట్రక్షన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), మునిసిపల్ నిధులతో ఏర్పాటు చేసిన పార్కును ఎంపీ అరుణ, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కలిసి ప్రారంభించారు.
ఎంపీ డీకే అరుణ
నారాయణపేటలో మునిసిపల్ పార్కు ప్రారంభం
నారాయణపేట టౌన్, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): కేంద్రం ప్రభుత్వం అన్ని మునిసిపాలిటీలకు సమానంగా నిధులు మంజూరు చేస్తుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆరో వార్డులో టీయూఎఫ్‌ఐడీసీ(తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ర్ఫాస్ట్రక్షన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్), మునిసిపల్ నిధులతో ఏర్పాటు చేసిన పార్కును ఎంపీ అరుణ, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను, నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అమృత్ పథకంలో భాగంగా నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడుతూ నారాయణపేటకు సైనిక్ స్కూల్ తేవాలని ఎంపీని కోరారు. ఎంపీ స్పందిస్తూ, స్థలం కేటాయిస్తే తప్పకుండా తెస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ విజయ్‌కుమార్, మార్కెట్ చైర్మన్ సదాశివారెడ్డి, మునిసిపల్ చైర్‌పర్సన్ గందె అనసూయ, ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.