Share News

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి

ABN , Publish Date - Nov 05 , 2024 | 11:09 PM

బాలకార్మిక వ్యవస్థ నిర్మూళించడం అందరి బాధ్యత అని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గంట కవితాదేవి అన్నారు.

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
పత్తి చేలలో పనిచేస్తున్న బాలికలతో మాట్లాడుతున్న న్యాయాధికారి గంట కవితాదేవి

గద్వాల, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : బాలకార్మిక వ్యవస్థ నిర్మూళించడం అందరి బాధ్యత అని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గంట కవితాదేవి అన్నారు. మంగళవారం మండలంలోని గుంటిపల్లి, రేకులపల్లి గ్రామాల్లో బాల కార్మిక వ్యవస్థను నియంత్రించేందుకు పత్తి, మిరప పొలాల్లో ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ చిన్నారికి విద్య చాలా అవసరం అన్నారు. పొలాలలో 18ఏళ్ల లోపు పిల్లలు పనిచేయడం గుర్తించి గుంటిపల్లి పాఠశాలలో చేర్పించారు. పనిలో పెట్టుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. లేబర్‌ ఆఫీస్‌ సీనియర్‌ అసిస్టెంటు అబ్రహాం, అడ్వికేట్‌ రాజేందర్‌, రూరల్‌ పోలీసులు ఉన్నారు.

Updated Date - Nov 05 , 2024 | 11:09 PM