పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలి
ABN , Publish Date - Dec 02 , 2024 | 11:46 PM
సంక్షేమ హాస్టళ్లలో ఉండి చదువు కుంటున్న పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాల ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు చెప్పారు.
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
అలంపూర్ చౌరస్తాలో బాలుర హాస్టల్ తనిఖీ
అలంపూర్ చౌరస్తా, డిసెంబరు 2, (ఆంధ్రజ్యోతి): సంక్షేమ హాస్టళ్లలో ఉండి చదువు కుంటున్న పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాల ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం తలపెట్టిన గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన అలంపూర్ చౌర స్తాలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర శాంతినగర్ వసతిగృహాన్ని సందర్శించారు. వం డిన ఆహారాన్ని రుచి చూశారు. స్టోర్‌లోని కూర గాయలను తనిఖీ చేశారు. పిల్లలకు అందించే ఆహారంలో రాజీపడవద్దని ప్రిన్సిపాల్ ధర్మారెడ్డికి సూచించారు. అనంతరం పాఠశాల పరిసరా ల ను పరిశీలించారు. ఆయన వెంట కలుగొట్ల పీఏ సీఎస్ చైర్మన్ గజేందర్‌రెడ్డి, నాయకులు కిషోర్, వెంకట్రాములు, శ్రీను ఉన్నారు.