CM Revanth Reddy: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
ABN , Publish Date - Apr 23 , 2024 | 07:38 AM
మహబూబ్ నగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరుగుతుంది. మద్దూరు మండలం తిమ్మాజీ పల్లి గ్రామంలో బావాజీ జాతరకు సీఎం హాజరవుతారు.
మహబూబ్ నగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంగళవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ (Congress) కార్యకర్తల సమావేశం జరుగుతుంది. మద్దూరు మండలం తిమ్మాజీ పల్లి గ్రామంలో బావాజీ జాతర (Bawaji Jatara)కు సీఎం హాజరవుతారు. సాయంత్రం 5:30 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా, బిజినపల్లి మండల కేంద్రంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం (Election Campaign) నిర్వహిస్తారు. అభ్యర్థి మల్లు రవి (Mallu Ravi) నేతృత్వంలో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు.
కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో బహిరంగ సభలో, నారాయణపేట జిల్లా మద్దూరులో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడంతో పాటు కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో బావోజీ బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి నాగర్‌కర్నూల్ జిల్లాకు వస్తున్న రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు పార్లమెంట్ నియోకజవర్గంలోని ఐదుగురు ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యారు. సన్నిహితుడైన మల్లురవి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న ఆయన సెంటిమెంట్ ప్రకారం బిజినేపల్లి బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అందుకోసం బిజినేపల్లి నుంచి వనపర్తి వెళ్లే రోడ్డు పక్కన 12 ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ను దారి మళ్లించనున్నారు. ఎస్పీతోపాటు దాదాపు వెయ్యి మంది పోలీస్ ఉన్నతాధికారులు సీఎం భద్రత కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
మద్దూరులో సీఎం పర్యటన ఇలా..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నారాయణపేట జిల్లా మద్దూర్ గ్రీన్ ప్యాలెస్‌లో మంగళవారం నిర్వహించనున్న పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. అదేవిధంగా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో జరిగే గిరిజనుల ఆరాధ్యదైవం బావోజీ బ్ర హ్మోత్సల్లో పాల్గొని, స్వామిని దర్శించుకోనున్నట్లు పార్టీ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల సమావేశం జరిగే గ్రీన్ ప్యాలెస్‌ను తిరుపతిరెడ్డి సోమవారం పరిశీలించారు. భద్రత ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నా రు. కోస్గిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కూడా ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని జోగులాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన మద్దూర్ సందర్శించి ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో కలిసి పర్యటన, బందో బస్తు వివరాలను వెల్లడించారు. మద్దూర్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సమా వేశం, అదే విధంగా తిమ్మారెడ్డిపల్లిలో జరిగే బావోజీ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని గిరిజనుల ఆరాధ్య దైవమైన గురులోక మాసంత్ (బావోజీ)ని సీఎం దర్శించుకోవడానికి రానున్న సందర్భంగా ఎలాంటీ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవకుండా 500 మంది సిబ్బందితో పటిష్ఠ బందోబస్తుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే మహబూబ్‌నగర్, వికారా బాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి బందోబస్తుకు వచ్చిన సిబ్బందితో ఎస్పీ యోగేష్ గౌతమ్ సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు ఇచ్చారు. 10 సెక్టార్లుగా విభజించి రూట్ మ్యాప్ ఆధారంగా మద్దూర్ నుంచి తిమ్మా రెడ్డిపల్లి జాతర వరకు బందో బస్తును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కేటాయించిన ప్రదేశాల్లో సిబ్బంది విధులు నిర్వహించాలని ఆదేశించారు.