జీఎంఆర్ తండ్రికి సీఎం నివాళి
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:06 PM
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే గవినోళ్ల మధుసూదన్‌రెడ్డి తండ్రి క్రీ.శే. కృష్ణారెడ్డి దశదిన కర్మకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం హాజరయ్యారు. ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలిక్యాప్టర్ బయల్దేరి, మధ్యాహ్నం ఒంటి గంటకు చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ సమీపంలో వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.
పాల్గొన్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు
కుటుంబ సభ్యులకు పరామర్శ
చిన్నచింతకుంట, సెప్టెంబరు 15: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే గవినోళ్ల మధుసూదన్‌రెడ్డి తండ్రి క్రీ.శే. కృష్ణారెడ్డి దశదిన కర్మకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం హాజరయ్యారు. ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలిక్యాప్టర్ బయల్దేరి, మధ్యాహ్నం ఒంటి గంటకు చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ సమీపంలో వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. హెలిక్యాప్టర్‌లో సీఎం వెంట టీపీసీసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జీవన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి హెలిక్యాప్టర్‌లో వచ్చారు. అక్కడి నుంచి కాన్వాయ్ ద్వారా గ్రామంలోని మధుసూదన్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అక్కడ సీఎం కృష్ణారెడ్డి చిత్ర పటానికి పూలు వేసి, నివాళులు అర్పించారు. జీఎంఆర్ తల్లి పద్మమ్మ, సోదరుడు భాస్కర్‌రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపారు. సీఎంతో పాటు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, మేఘారెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కశిరెడ్డి నారాయణరెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి, వీర్లపల్లి శంకర్, వాకిటి శ్రీహరి, కూచకుళ్ల రాజే్‌షరెడ్డి, అనిరుధ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, గద్వాల జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ సరిత, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి తనయుడు కొత్తకోట కార్తీక్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి, వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు.
కట్టుదిట్టమైన బందోబస్తు
దమగ్నాపూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి రాక సందర్భంగా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఐజీ సత్యనారాయణ, డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్, ఎస్పీ జానకి, అడిషనల్ ఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ,ఎస్‌ఐ శేఖర్‌లతో పాటు దాదాపు 600 మంది బందోబస్తులో పాల్గొన్నారు.