Share News

సామాజిక, ఆర్థిక కులగణన సర్వే ప్రారంభం

ABN , Publish Date - Nov 09 , 2024 | 11:05 PM

మండలాలు, గ్రామాల్లో సామాజిక, ఆర్థిక కుల గణన సర్వే కొనసాగుతోంది.

సామాజిక, ఆర్థిక కులగణన సర్వే ప్రారంభం
ధన్వాడలో సర్వేను పరీశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ బెల్‌షాలం

నారాయణపేట/ధన్వాడ/ఊట్కూర్‌/మరికల్‌/ మాగనూరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): మండలాలు, గ్రామాల్లో సామాజిక, ఆర్థిక కుల గణన సర్వే కొనసాగుతోంది. శనివారం ఆయా గ్రామాల్లో ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు కలిసి వార్డుల వారీగా విభజన చేసుకుని ఇంటింటికి వెళ్లి కుటుంబ యజమానితో వివరాలు తెలుసుకొని సర్వేలో పొందుపరుస్తున్నారు. పేట మునిసిపాలిటీ పరిధి లోని 24 వార్డుల్లో ఇంటింటి కుటుంబ సర్వే శని వారం ప్రారంభమైంది. సర్వేలో 89 మంది ఎన్యు మరేటర్లు, 10 మంది సూపర్‌వైజర్లు తమకు కేటాయించిన వార్డుల్లో సమగ్ర వివరాలు సేకరి స్తున్నారు. కాగా, ఒక్కో ఇంటి వద్ద సర్వేకు అరగంట సమయం పడుతోంది. 3, 4, 5, 7, 8, 23, 24 వార్డుల్లో మునిసిపల్‌ కమిషనర్‌ సునిత క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పర్యవేక్షించారు.

కులగణన సర్వేలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలి

మక్తల్‌ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శని వారం పట్టణంలోని ఏడో వార్డులోని ఆయన ని వాస గృహంలో ఎన్యుమరేటర్లకు 53 అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించాలన్నారు. ప్రతీ ఒక్కరు తమ వివరాలు అధికారులకు అందించి సహకరించాలన్నారు. సర్వేను పూర్తి పారదర్శకంగా, పక డ్బందీగా చేపట్టాలని అధికారు లకు సూచించారు. సంక్షేమ పథ కాల్లో అర్హులైన ప్రతీ ఒక్కరికి మేలు చేసేందుకే ఈ సర్వే చేస్తున్న ట్లు తెలిపారు. కార్యక్రమంలో ము నిసిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, కాంగ్రెస్‌ నాయకులు చంద్రకాంత్‌ గౌడ్‌, కట్టసురేష్‌కుమార్‌గుప్తా, బో య రవికుమార్‌, కావలి ఆంజనే యులు, నాగరాజు, ఓబ్లేష్‌, ఫయో ద్దీన్‌, మల్లేష్‌, రాము, అశోక్‌గౌడ్‌ తదితరులున్నారు. ధన్వాడలో జరుగుతున్న కుటుంబ సర్వేను శనివారం రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెల్‌షాలం పరిశీలించారు. సర్వే వివరాలను ఎన్యుమరేటర్లను అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్‌ వెంట ఎంపీడీవో సాయిప్రకాష్‌, డిప్యూటీ తహసీల్దార్‌ కతలప్ప, ఏఎస్‌వో నసీరుద్దీన్‌, గిర్దావర్‌ మల్లేష్‌లు ఉన్నారు.ఊట్కూర్‌ మండలం మగ్దూంపూర్‌ గ్రామంలో సర్వే తీరును మండల ప్రత్యేక అధికారి ఉమా పతి, ఎంపీడీవో ధనుంజయ్‌గౌడ్‌, ఎంపీవో ఎల్‌ ఎంఎన్‌.రాజు పరిశీలిస్తున్నారు. పగిడిమారిలో తహసీల్దార్‌ చింత రవి సర్వేను పరిశీలిస్తున్నారు. మరికల్‌లో కుటుంబ సర్వే ప్రక్రియను ప్రత్యేకాధికారి, డీపీవో కృష్ణ పరిశీలించారు. తప్పులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా సర్వేను నిర్వహించాలని ఎన్యుమరేటర్లకు సూచించారు. అనం తరం ఎన్యుమరేటర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఇన్‌చార్జి ఎంపీడీవో కొండన్న, పంచాయతీ కార్యదర్శి శ్యామ్‌సుందర్‌ రెడ్డి, ఉపాధ్యాయురాలు శ్రీలత, సందీప్‌ తదితరులున్నారు. మాగనూరులో ఇంటింటి సర్వేను ఎంపీడీవో రహమత్‌దిన్‌ పరిశీలించారు. సర్వే కోసం వచ్చిన ఎన్యుమరేటర్లకు సహకరించి వారి అడిగిన పత్రా లను, అడిగిన ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానాలు చెప్పాలని ప్రజలను కోరారు.

Updated Date - Nov 09 , 2024 | 11:05 PM