ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండొద్దు
ABN , Publish Date - Dec 02 , 2024 | 11:30 PM
జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో తీసుకుంటున్న ఫిర్యా దులు పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అధికారులను ఆదేశించారు.
- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో తీసుకుంటున్న ఫిర్యా దులు పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అధికారులను ఆదేశించారు. సో మవారం సమీకృత జిల్లా అధికారుల సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్ర మంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు, జడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, డీఆర్డీవో నర్సిం హులుతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీక రించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సీఎం ప్రజావాణి, జిల్లాస్థాయి ప్రజావాణి నుంచి వివిధ శాఖలకు అందిన ఫిర్యాదుల పెండింగ్ జా బితాను శాఖల వారిగా చదివి వినిపించారు. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు.
ఆర్డర్ కాఫీలను సిద్ధం చేయాలి
జిల్లాకు ఎంపికైన గ్రూప్-4 అభ్యర్థుల ఆర్డర్ కాఫీలను సిద్ధం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమావేశంలో ఆయన పలు అంశాలను సమీక్షించారు. ఇటీవల జరిగిన గ్రూప్-4 అభ్యర్థుల ఎంపికల్లో మహబూబ్‌నగర్ జిల్లాకు అంటే ఆయా శాఖలకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి జాయినింగ్ ఉత్తర్వులను (ఆర్డర్‌లను) సిద్ధం చేయాలన్నారు. ఈనెల 4న పెద్దపల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిల్లాల వారిగా కేటాయించబడిన గ్రూప్-4 అభ్యర్థులకు ఉత్తర్వులను అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 4న ఉదయం ఆరు గంటలకు పెద్దపల్లికి బయలు దేరాల్సి ఉంటుందని, ఈ విషయాన్ని అభ్యర్థులందరికీ ఫోన్ చేసి ఆ రోజు ఉదయం 5 గంటలకు జిల్లా కేద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానానికి చేరుకోవాలని సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లాలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను ఉద్దేశించి మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ 94 శాతం పూర్తయ్యిందని తెలిపారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం కప్ క్రీడలు ఈనెల 7 నుంచి జనవరి రెండు వరకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు నిర్వహిస్తున్నందున ఈనెల 7, 8 తేదీల్లో గ్రామ స్థాయిలో, 10 నుంచి 12 వరకు మండల స్థాయిలో, 16 నుంచి 21వరకు జిల్లా స్థాయిలో, 27 నుంచి జనవరి 2 వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిర్వహిస్తున్న క్రీడల్లో విజేతలు మాత్రమే రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారని తెలిపారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల కాలనీలకు మౌలిక వసతుల ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయని, గత పెండింగ్, నూతన పనులను సంబంధిత ఇంజనీర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా క్రీడలు, యువజన అధికారి శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.