ప్రజలకు ఇబ్బందులు లేకుండా భారత్ మాల నిర్మాణం
ABN , Publish Date - Nov 05 , 2024 | 11:39 PM
ప్రజలకు, రైతులకు ఇబ్బందులు లేకుండా భారత్‌మాల రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నా రు.
- గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్
గట్టు, నవంబరు 5 ( ఆంధ్రజ్యోతి): ప్రజలకు, రైతులకు ఇబ్బందులు లేకుండా భారత్‌మాల రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నా రు. మంగళవారం మండలంలోని ఆరగిద్ద, తప్పెట్లమొర్సు గ్రామాల మధ్య చేపడుతున్న భారత్‌మాల రహదారి పనులను ఎస్‌ఈ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలసి కలెక్టర్ పరిశీలించారు. అండర్‌పాస్ విషయంలో తప్పెట్లమొర్సు గ్రామస్థులకు తలెత్తిన రహదారి సమస్యపై హైవే అధారిటీ అధికారులతో కలసి గ్రామస్థులతో చర్చించారు. భారత్‌మాల రహదారి పనులను మ్యాపింగ్ ద్వారా హైవే ఆఽధారి టీ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. రహదారి నిర్మాణంలో భాగంగా రైతుల భూములకు సర్వీస్ రోడ్లును అనుసంధానం చేస్తామన్నారు. పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం గట్టు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో చ ర్చించారు. భారత్‌మాల పనులలో ఎలాంటి ఇ బ్బందులు లేకుండా చూడాలని అధికారులను అదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సరితరాణి, రహదారి నిర్మాణ ఇంజనీరు సురేందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.