Share News

కొనసాగిన సామాజిక తనిఖీ

ABN , Publish Date - Nov 20 , 2024 | 10:53 PM

మండలంలోని 16 గ్రామాల్లో 2023-24 సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులపై అడిట్‌ బృందం గ్రామాల వారిగా తనిఖీ చేసి గ్రామ సభలు ఏర్పాటు చేసింది.

కొనసాగిన సామాజిక తనిఖీ
సామాజిక తనిఖీలో వివరాలు తెలుసుకుంటున్న డీఆర్డీవో నరసింగ రావు

- రూ.1,27,773 రికవరీకి ఆదేశం

- నలుగురు టీఏలు, 12 మంది ఎఫ్‌ఏలకు షోకాజ్‌ నోటీసులు

మానవపాడు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని 16 గ్రామాల్లో 2023-24 సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులపై అడిట్‌ బృందం గ్రామాల వారిగా తనిఖీ చేసి గ్రామ సభలు ఏర్పాటు చేసింది. బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయం వద్ద డీఆర్డీవో నరసింగరావు ఆధ్వర్యంలో ప్రజావేదిక ఏర్పాటు చేయగా, తనికీ బృందం గ్రామాల్లో జరిగిన అక్రమాలను ప్రజావేదికలో బహిర్గతం చేశారు. గ్రామాల్లో ఉపాధి పనులకు సంబంధించిన సమాచారాన్ని రికార్డుల్లో పొందుపరుచడంలో నిర్లక్ష్యం వహిస్తున్నరని, కొర్విపాడు, బోరవెల్లి గ్రామాలతో పాటు ఇతర గ్రామాల్లో నర్సరీ, అవెన్యూ ఫ్లాంటేషన్‌, పల్లెప్రకృతి వనాల్లో చేసిన పనులకు గ్రామ పంచాయతీ అకౌంట్‌కి కాకుండా టీఏ రమేష్‌ భార్యపై, పంచాయితీ కార్యదర్శి నిర్మల భర్త పేర్ల మీదుగా ఉన్న అకౌంట్‌లోకి డబ్బును జమ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో రూ.1,27,773 రికవరీకి ఆదేశించారు. ప్రతీ గ్రామంలో ఉపాధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించడంలో, జాబ్‌ కార్డులు రెన్యువల్‌ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, నలుగురు టెక్నికల్‌ అసిస్టెంట్లు, 12 మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లుకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. తనిఖీ బృందం సిబ్బంది వివిధ రికార్డుల జిరాక్స్‌ తెలుపలేదు. భోజనం, వీఎస్‌ఏలకు, రవాణ, ప్రజావేదిక కోసం రూ.74,345 ఖర్చు చేశారు. ప్రజా వేదికలో ఎంపీడీవో భాస్కర్‌, అంబుడ్స్‌ మెన్‌ జమ్మన్న, ఏపీవోలు నాయక్‌, శివశంకర్‌, ఎస్‌ఆర్పీ శ్రీకాంత్‌, డీఆర్పీలు రఘు, అనిల్‌, పంచాయితీ కార్యదర్శులు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 10:53 PM