Share News

పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి

ABN , Publish Date - Nov 23 , 2024 | 11:00 PM

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామరెడ్డి, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకుడు యాదగిరి డిమాండ్‌ చేశారు.

పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
పేట మార్కెట్‌ యార్డులో వరి కుప్పలను పరిశీలిస్తున్న నాయకులు

నారాయణపేట, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి స్వామినాథన్‌ సిఫార్సులు అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామరెడ్డి, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకుడు యాదగిరి డిమాండ్‌ చేశారు. శనివారం నారాయణపేట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వరి కొనుగోలు వివరాలను రై తులు, వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. గిట్టుబాటు ధర అందక రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయిం చిన మద్దతు ధరతో రైతులకు ఎలాంటి మేలు జరగడం లేదన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రామ్‌లు మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం సేకరిస్తూన్న భూములకు 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనిదినాలను 200 రోజులకు పెంచి రూ.600 కూలీ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వెంకట్రాములు, అశోక్‌, బి.నారాయణ, శివకుమార్‌, ప్రకాష్‌, వెంకటప్ప, రాములు, బాలకృష్ణ తదితరులున్నారు.

Updated Date - Nov 23 , 2024 | 11:00 PM