Share News

ప్రభుత్వ పాఠశాలల్లో వంటల పండుగ

ABN , Publish Date - Dec 31 , 2024 | 11:46 PM

భూనీడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులు ఫుడ్‌ ఫెస్టి వల్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు స్వతహాగా ఇంటి వద్ద తమకు నచ్చిన ఆహార పదార్థాన్ని తయారు చేసుకొని పాఠశాలల్లో ఏర్పాటుచేసిన స్టాళ్లలో ప్రదర్శించారు. పరిశీలించిన ఉపాధ్యాయులు ఆయా వంటకాలు మన శరీరానికి ఏవిధమైన లాభాలు కలుగజేస్తాయో వివరించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో వంటల పండుగ
భూనీడు జడ్పీహెచ్‌ఎస్‌లో రకరకాల వంటలను ప్రదర్శిస్తున్న విద్యార్థులు

కొత్తపల్లి/ఊట్కూర్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): భూనీడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులు ఫుడ్‌ ఫెస్టి వల్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు స్వతహాగా ఇంటి వద్ద తమకు నచ్చిన ఆహార పదార్థాన్ని తయారు చేసుకొని పాఠశాలల్లో ఏర్పాటుచేసిన స్టాళ్లలో ప్రదర్శించారు. పరిశీలించిన ఉపాధ్యాయులు ఆయా వంటకాలు మన శరీరానికి ఏవిధమైన లాభాలు కలుగజేస్తాయో వివరించారు. వంటకాలక సంబంధించి ఒక్కో పదార్థం ఎక్కడ లభిస్తాయో, వాటి యొక్క ధర లు, తయారీకి తల్లిదండ్రులు కష్టపడిన తీరును విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెచ్‌ఎం డా.చెన్నకేశవరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అదేవిధంగా, ఊట్కూర్‌ మండలం చిన్నపొర్ల గ్రామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియంలో మంగళవారం ఆహార మహోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు తరగతుల వారీగా వివిధ రకాల వంటకాలు తయారు చేసుకొని వచ్చి ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా కమిటీ మాజీ చైర్మన్‌ జే.చాంద్‌పాషా, ప్రధానోపాధ్యాయుడు ఎండీ.మొహినుద్దీన్‌లు వివిధ రకాల వంటకాలను పరిశీలించి, విద్యార్థులను అభినందించారు.

Updated Date - Dec 31 , 2024 | 11:46 PM