డేటా ఎంట్రీ వేగంగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Dec 04 , 2024 | 11:28 PM
సమగ్ర ఇం టింటి కుటుంబ సర్వేకు సంబంధించి డేటా ఎంట్రీ ప్రక్రియను వేగంగా పూ ర్తి చేయాలని అదనపు కలెక్టర్ సం చిత్ గంగ్వార్ ఆదేశించారు.
- అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, డిసెంబ రు 4 (ఆంధ్రజ్యోతి) : సమగ్ర ఇం టింటి కుటుంబ సర్వేకు సంబంధించి డేటా ఎంట్రీ ప్రక్రియను వేగంగా పూ ర్తి చేయాలని అదనపు కలెక్టర్ సం చిత్ గంగ్వార్ ఆదేశించారు. బుధ వారం జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సర్వే డేటా ఎంట్రీ ప్ర క్రియపై ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు, ఇతర సిబ్బందితో వీసీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లా డుతూ.. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎంట్రీ చేయాలని సూచించారు. ప్రతీ రోజు ఎంట్రీ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. దరఖాస్తులను జాగ్రత్తగా భద్రపరచాలని చెప్పారు. మునిసి పాలిటీలలో కూడా డేటా ఎంట్రీ ప్రక్రియ ప్రారం భించి వేగంగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో ఇంకా ఏవైనా సర్వే కాకుండా మిగిలి పోయి ఉంటే వాటిని పూర్తి చేయాలన్నారు. సర్వే లో ప్రతీ ఒక్క ఇల్లు పూర్తి కావాలని, ఏదీ మిగి లిపోకూడదని ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈవో యాదయ్య, పీపీవో భూపాల్‌రెడ్డి, ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.