Share News

తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలి

ABN , Publish Date - Nov 13 , 2024 | 11:45 PM

ఎలాంటి తప్పుల కు తావివ్వకుండా వివరాలను నమోదు చేయాలని ఎన్యుమరే టర్లకు కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సూచించారు.

తప్పులు లేకుండా వివరాలు నమోదు చేయాలి
మద్దూర్‌లో సర్వేను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

- కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

మద్దూర్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి తప్పుల కు తావివ్వకుండా వివరాలను నమోదు చేయాలని ఎన్యుమరే టర్లకు కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సూచించారు. బుధవారం మండ లంలో కొనసాగుతున్న సర్వేను పరిశీలించారు. పట్టణంలోని మీది గేరులో చేపడుతున్న కుటుంబ వివరాలను నమోదు చేపుకోవడానికి ఎంత సమయం పడు తుందని ఎన్యుమరేటర్‌ను అడిగారు. చిన్న కు టుంబమైతే పది నిమిషాలు, పెద్ద కుటుంబం, భూమి వివరాలు ఉంటే 15 నుంచి 20 నిమి షాల సమయం పడుతుందని ఎన్యుమరేటర్‌ కలెక్టర్‌కు వివరించారు. జాబితాలో అడిగే వివ రాలను తెలిపి వారికి సహకరించాలని కుటుంబ యజమానులకు కలెక్టర్‌ సూచించారు. పలు వివరాలను ఎంపీడీవో నర్సింహారెడ్డికి కలెక్టర్‌ అడిగి తెసుకున్నారు. ఎంపీవో నర్సింహారెడ్డి, రా మన్న, దేవరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 11:45 PM