దేవీశరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రం విడుదల
ABN , Publish Date - Sep 16 , 2024 | 11:47 PM
ఐదవ శక్తి పీఠం అలంపూర్ శ్రీజోగుళాంబదేవీ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, పాలకమండలి సభ్యుల సమక్షంలో విడుదల చేశారు.
అలంపూర్, సెప్టెంబరు 16: ఐదవ శక్తి పీఠం అలంపూర్ శ్రీజోగుళాంబదేవీ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, పాలకమండలి సభ్యుల సమక్షంలో విడుదల చేశారు. సోమవారం అలంపూర్‌కు చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ పాలకమండలి సభ్యులు, ఈఓ పురందర్ కుమార్‌లు స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జోగుళాంబదేవి ఆలయంలో చైర్మన్ చిన్న కృష్ణయ్య నాయుడు, వైస్ చైర్మన్ శేఖర్‌రెడ్డితో కలిసి శరన్నవరాత్రి కరపత్రాలను విడుదల చేశారు. ఉత్సవాలకు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే వారికి సూచించా రు. అనంతరం బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ సమీపంలోని గోశాలను ఎమ్మెల్యే విజయుడు సందర్శించారు. గోవులకు సరైన సౌకర్యాలతో పాటు మె రుగైన ఆహారం అందించాలని ఆలయ ఈఓను ఆదేశించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్‌శర్మ, కౌన్సిలర్లు ఇంతియాజ్, వెంకట్రామయ్యశెట్టి, సదానందమూర్తి, రాజన్న, శ్రీనివాస్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డి, రజినీబాబు, నాగరాజు, నాగభూషణం, ఎర్రన్న, మహేష్, సుధాకర్, జీవన్, షబ్బీర్, మనోహర్, రఘురాం, పవన్ పాల్గొన్నారు.