Share News

చట్టాలపై అవగాహన లేక ఇబ్బందులు

ABN , Publish Date - Dec 24 , 2024 | 11:51 PM

చట్టాలపై అవగాహన లేక సమాజంలో ఎన్నోవ ర్గాల ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలంపూర్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌ న్యాయాధి కారి మిథున్‌తేజ అన్నారు.

చట్టాలపై అవగాహన లేక ఇబ్బందులు
ఉండవల్లి న్యాయవిఙ్ఞాన సదస్సులో మాట్లాడుతున్న న్యాయాధికారి మిథున్‌ తేజ

ఉండవల్లి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): చట్టాలపై అవగాహన లేక సమాజంలో ఎన్నోవ ర్గాల ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలంపూర్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌ న్యాయాధి కారి మిథున్‌తేజ అన్నారు. అలంపూర్‌ కోర్టు వారి ఆధ్వర్యంలో మంగళవారం మండల కేం ద్రంలోని రైతువేదికలో రైతులు, వివిధ వర్గాలకు న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిఽథిగా హాజరైన న్యాయాధి కారి మాట్లాడుతూ రాజ్యాంగం మనకు హక్కుల ను కల్పించిందని, ఆ హక్కుల గురించి ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలన్నారు. చట్టాల గురించి అవగాహన లేకపోవడంతో చిన్నచిన్న సమస్యలు పెద్దవిగా మారుతున్నాయని, ప్రజలు మోసాల బారిన పడుతున్నారని అన్నారు. రైతులు సాగు సమయంలో విత్తనాల కొనుగోలు దగ్గర నుంచి పురుగుల మందు, పంట ఉత్పత్తుల విక్రయం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంటనష్టం వంటి విషయాలను తెలుసుకునే అవకాశం ఉం టుందన్నారు. ఆస్థుల క్రయవిక్రయాల సమయం లో న్యాయపరమైన చిక్కులు తెలుసుకుని ముం దుకుపోవాలన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థా నం ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో అన్నివర్గా ల ప్రజలకు చట్టాలపై అవ గాహన కల్పిస్తున్నా మని చెప్పారు. అనంతరం పలువురు న్యాయవా దులు మాట్లాడారు. కార్యక్రమంలో అలంపూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సురేష్‌కుమార్‌, న్యాయవాదులు గజేంద్రగౌడు, శ్రీనివాసులు, తిమ్మారెడ్డి, ఆంజనేయులు, కరుణాకర్‌, ఉమాప తి, ఏజీపీ మధు, రైతుసం ఘం సభ్యులు గోద జయన్న, ఙ్ఞానేశ్వర్‌ రెడ్డి, గో విందు, పలువురు రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 11:52 PM