మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దు
ABN , Publish Date - Nov 23 , 2024 | 10:59 PM
గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎస్పీ యో గేష్గౌతమ్ అన్నారు.
ఎస్పీ యోగేష్‌గౌతమ్
కోస్గి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎస్పీ యో గేష్గౌతమ్ అన్నారు. శనివారం కోస్గి ఇంజనీరింగ్ కళాశాలలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ క్రైమ్, ర్యాగింగ్‌లపై విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును ఉద్ధేశించి ఎస్పీతో పాటు ట్రైనీ కలెక్టర్ గరీమానరుల ప్రసంగించారు. విద్యార్ధులు తమ జీవితంలో ఉన్నత ల క్ష్యాలను అధిగమించేందుకు అనుసరించాల్సిన అంశాలు వివరిస్తూ పలువురి జీవితపాఠాలు వివరించారు. కార్యక్రమంలో సీఐ దస్రునాయక్, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, ఎంఈవో శంకర్‌నాయక్, ఎంపీడీవో శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్, ఎస్సై బాల్‌రాజ్ తదితరులున్నారు.