Share News

కలెక్టరు సారు టోకెన్లు ఇవ్వరా?

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:49 PM

టోకెన్ల కోసం అలంపూర్‌ వ్యవ సాయ మార్కెట్‌యార్డు కార్యాలయం వద్ద పత్తి రైతులు సోమవారం బారులు తీరారు.

కలెక్టరు సారు టోకెన్లు ఇవ్వరా?

- అలంపూర్‌ మార్కెట్‌ యార్డు వద్ద రైతుల బారులు

- ఇప్పుడే ఇవ్వలేమన్న అధికారులు

అలంపూర్‌ చౌరస్తా, డిసెంబరు 2, (ఆంధ్రజ్యోతి): టోకెన్ల కోసం అలంపూర్‌ వ్యవ సాయ మార్కెట్‌యార్డు కార్యాలయం వద్ద పత్తి రైతులు సోమవారం బారులు తీరారు. ఇటీవల కలెక్టర్‌ బీఎం సంతోష్‌ కాటన్‌మిల్లును సందర్శించిన సందర్భంలో డిసెంబరు-2 నుంచి టోకెన్లు ఇస్తామని చెప్పారని తీరా ఇక్కడికి వచ్చి అడిగితే ఇప్పుడే ఇవ్వలేమని అధికారులు చెబు తున్నారని మల్దకల్‌, ధరూరు, అయిజ, తదితర మండలాల్లోని ఆయాగ్రామాల పత్తి రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే సీసీ ఐ కొనుగోలు చేసిన పత్తి మిల్లులో నిండిపో యిందని మరో నాలుగు రోజుల్లో ఖాళీచేసి టో కెన్లు ఎప్పుడిచ్చేది చెబుతామని ఏవో సుబ్బారె డ్డి, సెక్రటరీ ఎల్లస్వామి రైతులకు సర్ది చెప్పా రు. సోమవారం వచ్చిన రైతులందరి వివరాలు తీసుకుని టోకెన్లు ఇచ్చే విషయాన్ని ముందుగా నే సమాచారం ఇస్తామని చెప్పి వారిని తిప్పి పంపారు. కార్యాలయానికి వచ్చి వ్యయప్రయా సలకు గురికావద్దని టోకెన్లు ఇచ్చే విషయం రెండ్రోజుల ముందుగానే పేపర్‌ ప్రకటన ద్వా రా, ఆయాగ్రామాల ఏఈవోల ద్వారా తెలియ జేస్తామని చెప్పారు.

Updated Date - Dec 02 , 2024 | 11:49 PM