Share News

ఇథనాల్‌ ఫ్యాక్టరీని నిర్మించొద్దు

ABN , Publish Date - Nov 06 , 2024 | 11:08 PM

పచ్చని పంట పొలాలు పండే ప్రాంతంలో విషపూరితమైన ఇథనాల్‌ ఫ్యాక్టరీని నిర్మించొద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు.

ఇథనాల్‌ ఫ్యాక్టరీని నిర్మించొద్దు
ఫ్యాక్టరీ నిర్మాణ స్థలంలో నిరసన తెలుపుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి

రాజోలి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : పచ్చని పంట పొలాలు పండే ప్రాంతంలో విషపూరితమైన ఇథనాల్‌ ఫ్యాక్టరీని నిర్మించొద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పెద్ద ధన్వాడ గ్రామంలో నిర్మిస్తున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీ స్థలాన్ని బీజేపీ నాయకులు, రైతులతో కలిసి పరిశీలించి, అక్కడ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ గ్రామం సమీపంలో నిర్మిస్తున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీ భవిష్యత్‌ తరాలను నాశనం చేస్తాయని, అయినప్పటికీ అధికారులు, ఫ్యాక్టరీ కంపెనీ యాజమాన్యం కుమ్మక్కై అక్రమంగా అనుమతులు తెచ్చుకున్నారన్నారు. గ్రామస్థుల అభిప్రాయాలు సేకరించకుండా ఫ్యాక్టరీ నిర్మిస్తే చూస్తూ ఊరుకోమని మండిపడ్డారు. తుంగభద్ర నది కలుషితమయ్యే అవకాశం ఉందని, ఫ్యాక్టరీని రద్దు చేసే వరకూ పోరాడుతామన్నారు. బీజేపీ మండల నాయకులు రాజగోపాల్‌, గోపాల శర్మ, భరత్‌రెడ్డి, భీమన్న, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 11:08 PM