ధాన్యం కొనుగోలులో పొరపాట్లు జరగొద్దు
ABN , Publish Date - Nov 06 , 2024 | 12:02 AM
ధాన్యం కొనుగోలు చేసేట ప్పుడు ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకూ డదని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారుల ను ఆదేశించారు.
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కొనుగోలు చేసేట ప్పుడు ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకూ డదని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారుల ను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని స మావేశ మందిరంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహి ంచారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మా ట్లాడారు. ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు నిబంఽ దనలు పాటించాలని, గతంలో చేసిన పొరపాట్ల ను పునరావృతం చేయకూడదని తెలిపారు. కేం ద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టార్పాలిన్లు, టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. స న్నాలకు, దొడ్డు వడ్లకు వేర్వేరు కేంద్రాలు ఏర్పా టు చేయాలని పేర్కొన్నారు. ప్రతీ పీసీసీ వద్ద అ న్ని వివరాలతో బ్యానర్ ఏర్పాటు చేయాలన్నారు. బుధవారానికి అన్ని పీపీసీలను ప్రారంభించాలని ఆదేశించారు. సన్నాలకు దొడ్డు వడ్ల బస్తాలపై ప్రత్యేకమైన మార్కింగ్ ఉంటుందని, అది పక్కా గా వేయాలన్నారు. ప్రతీ చిన్న సమాచారాన్ని, ఎ ప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో ఎంట్రీ చేయాలని సూ చించారు. రైతులు వడ్లు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన తరువాత టోకెన్స్ ఇచ్చి వాటి ఆధారంగా బరువు కొలిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సన్నాలకు 14 శాతం తేమ మించకూడదని, ప క్కాగా చెక్ చేయాలని చెప్పారు. ఎక్కడైనా సరి గ్గా నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్‌లో కంట్రో ల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. డీఆర్‌డీవో ఉమాదేవి, పౌర సరఫ రాల శాఖ డీఎం ఇర్ఫాన్, సివిల్ సప్లయ్ అధికారి విశ్వనాథ్, ఏపీఎంలు, ఐకేపీ కేంద్రాల ఇంచార్జీ పాల్గొన్నారు.