విధుల్లో అంకితభావం అవసరం
ABN , Publish Date - Dec 02 , 2024 | 11:48 PM
విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొ ని ప్రజలకు సేవలు అందించాలని ఎస్పీ శ్రీనివాసరావు ట్రైనింగ్ పూర్తిచేసుకొని కొత్తగా విధుల్లో చేరనున్న కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం చేశారు.
- జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
- విధుల్లో చేరిన 72 మంది నూనత కానిస్టేబుళ్లు
గద్వాల క్రైం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొ ని ప్రజలకు సేవలు అందించాలని ఎస్పీ శ్రీనివాసరావు ట్రైనింగ్ పూర్తిచేసుకొని కొత్తగా విధుల్లో చేరనున్న కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న 72 మంది కానిస్టేబుళ్లు జిల్లాకు రావడంతో, వారికి సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఎస్పీ మా ట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేయడం అనేది ప్రజలకు అత్యంత చేరువగా ఉంటూ సేవచేసే గొప్ప అవకాశం అన్నారు. మిగిలిన ఇతర ప్రభుత్వ ఉద్యోగాలతో పోలీస్తే పోలీస్ శాఖ ఎంతో భిన్నమైనదని, ఎన్నో సవాళ్లతో కూడుకున్నదన్నారు. మానసికంగా, శారీరకంగా దృఽఢంగా ఉండాలని సూచించారు. ప్రతి పోలీస్ ఉద్యోగ బాధ్యతల్లో చేరిన మరుక్షణం నుండే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారని, శాంతిభద్రతల పరిరక్షణకు అనుక్షణం పాటుపడతారని పేర్కొన్నారు. నూతన కానిస్టేబుళ్లకు ఉన్నతాధికారుల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతాయని, వారి సూచనలకు, ఆదేశాలకు అనుగుణంగా క్ర మ శిక్షణతో పనిచేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ గుణశేఖర్, ఆర్‌ఐ వెంకటేష్, సిబ్బంది ఉన్నారు.