అంకితభావంతో విధులు నిర్వహించాలి
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:01 PM
అంకితభావంతో విధులు నిర్వహిస్తేనే ప్రజల మన్న నలు పొందుతారని నారాయణపేట డీఎస్పీ లింగయ్య అన్నారు.
డీఎస్పీ
మద్దూర్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అంకితభావంతో విధులు నిర్వహిస్తేనే ప్రజల మన్న నలు పొందుతారని నారాయణపేట డీఎస్పీ లింగయ్య అన్నారు. శనివారం మద్దూర్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. నమోదైన కేసులు, చేపట్టిన చర్యలు తదితర విషయాలను ఎస్‌ఐ రాంలాల్‌ను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు సూచనలు చేశారు. అంతకుముందు సిబ్బంది పరేడ్‌ను వీక్షించారు. ఏఎస్‌ఐ ఉస్మాన్, సిబ్బంది ఉన్నారు.