Share News

18న జడ్చర్ల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక

ABN , Publish Date - Nov 08 , 2024 | 11:41 PM

జడ్చర్ల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికను ఈనెల 18న నిర్వహించనున్నారు.

18న జడ్చర్ల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక

జడ్చర్ల, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : జడ్చర్ల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికను ఈనెల 18న నిర్వహించనున్నారు. అందుకు సంబందించిన ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల అధికారి జారీ చేశా రు. ఈ నెల 14లోగా మునిసిపల్‌ కౌన్సిలర్‌లకు, ఎక్స్‌ అఫిషియో సభ్యులకు నోటీసులను జారీ చే యాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ నెల 18న చైర్‌పర్సన్‌ ఎన్నికను నిర్వహించాలని, లేనిపక్షం లో 19న నిర్వహించాలని ఉత్తర్వులో పేర్కొన్నా రు. జడ్చర్ల మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న దోరేపల్లి లక్ష్మీని అవిశ్వాస తీర్మానం చేపట్టి, పార్టీ లకతీతంగా కౌన్సిలర్‌లు అవిశ్వాసానికి ఓటు వేయడంతో చైర్‌పర్సన్‌ పదవిని ఆమె కోల్పోయా రు. ప్రస్తుతం వైస్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న పాలాదిసారిక ఇన్‌చార్జీ చైర్‌పర్సన్‌గా కొన సాగు తున్నారు. చైర్‌పర్సన్‌గా ఎన్నిక కావడానికి బీఆర్‌ ఎస్‌ పార్టీకి పూర్తి మద్దతు ఉన్నా, ఆ పార్టీలోని కౌన్సిలర్‌ల మధ్య సఖ్యత లేకపోవడం, అంతర్గత విభేదాలు ఉండడంతో చైర్‌పర్సన్‌ ఎన్నికపై ఆస క్తి నెలకొంది. జడ్చర్ల మునిసిపాలిటీలో 27 మంది కౌన్సిలర్‌లు ఉన్నారు. వీరిలో 23 మంది బీఆర్‌ఎస్‌ పార్టీకి, చెరో రెండు కౌన్సిలర్‌లు కాంగ్రె స్‌, బీజేపీకి చెందిన వారుండగా, బీఆర్‌ఎస్‌ పార్టీలో నుంచి ముగ్గురు కౌన్సిలర్‌లు ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అలాగే బీజేపీ నుంచి గెలిచిన మరో కౌన్సిలర్‌ సైతం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీలో బీసీ మహిళా కౌన్సిలర్‌ లేకపోవడంతో చైర్‌పర్సన్‌ సీటు బీఆర్‌ఎస్‌ పార్టీ దక్కించుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తు న్నారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక అంశంలో ఇటు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి జోక్యం చేసుకోకపోవడంతో చైర్‌పర్సన్‌గా ఎవరు గద్దెనెక్కుతారో అంటూ ఆసక్తికరమైన రాజకీయ చర్చ పట్టణంలో ప్రస్తుతం సాగుతోంది.

Updated Date - Nov 08 , 2024 | 11:41 PM