సమస్యల పరిష్కారం కోసమే విద్యుత్ సదస్సులు
ABN , Publish Date - Nov 03 , 2024 | 10:52 PM
సమస్యల పరిష్కారం కోసమే విద్యుత్ సదస్సులు నిర్వహిస్తున్నామని ఎస్‌ఈ సంజీవరెడ్డి అన్నారు.
- ఎస్‌ఈ సంజీవరెడ్డి
- విద్యుత్ వినియోగదారుల సదస్సుకు 52 ఫిర్యాదులు
నారాయణపేట, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం కోసమే విద్యుత్ సదస్సులు నిర్వహిస్తున్నామని ఎస్‌ఈ సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం నారాయణపేట విద్యుత్ జిల్లా కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సదస్సు జరిగింది. సదస్సుకు ఎస్‌ఈ సంజీవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా సిబ్బంది పనిచేస్తున్నార న్నారు. జిల్లాలోని మద్దూర్, దామరగిద్ద, నారాయణపేట మండలాల నుంచి 52 ఫిర్యాదులు వచ్చాయని, దశలవారీగా వాటిని పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. బీకేఎస్ ఆధ్వర్యంలో నాయకులు పలు ఫిర్యాదులు చేశారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అదికారులు జితేంద్ర, శ్రీనివాస్, మహేష్‌గౌడ్, సాయినాథ్‌రెడ్డి, విజయభా స్కర్, అనల్, బీకేఎస్ నాయకులు వెంకోబా, అనంత్‌రెడ్డి, బాలప్ప, ప్రభు, మల్లికార్జున్, వెంకటప్ప, లక్ష్మినారాయణ, విశ్వనాథ్‌రెడ్డి, బసప్ప, నర్సప్ప తదితరులున్నారు.