విద్యుత్‌ను న్యాయబద్ధంగా వినియోగించాలి
ABN , Publish Date - Nov 03 , 2024 | 10:53 PM
విద్యుత్‌ను న్యాయబద్దంగా వినియోగించాలని ఏడీఈ నీలిగోవిందు తెలిపారు.
అయిజ/అలంపూర్ చౌరస్తా, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి) : విద్యుత్‌ను న్యాయబద్దంగా వినియోగించాలని ఏడీఈ నీలిగోవిందు తెలిపారు. విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అయిజ సబ్‌స్టేషన్‌లో వినియోగదారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా నీలి గోవిందు మాట్లాడుతూ ప్రతీ ఇంటికి విద్యుత్ మీటర్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అక్రమ విధ్యుత్ వాడకం చట్టరీత్యా నేరం అన్నారు. ప్రస్తుతం మెరుగైన విద్యుత్, సేవలు అందిస్తున్నామన్నారు. ఫిర్యాదులు నేరుగా కార్యాలయంలో అందజేయాలని, అలా కాని యెడల హైదరాబాద్‌లోని విద్యుత్ వినియోగదారుల ఫోరం నందు ఫిర్యాతు చేయవచ్చు అన్నారు. ఇంటి ముందు విద్యుత్ తీగలు ప్రమాదభరితంగా వేలాడుతున్నాయని, వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లు అందించాలని వినతులు వచ్చినట్లు తెలిపారు. అయిజ ఏఈ నరేంద్ర, గట్టు ఏఈ చెన్నయ్య, రాజోళి ఏఈ సందీప్, విద్యుత్ సిబ్బంది రామకృష్ణ, లైన్ ఇన్‌స్పెక్టర్ సర్వోత్తమ్, జార్జీ పాల్గొన్నారు. అదే విధంగా అలంపూర్ చౌరస్తాలోని విద్యుత్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన వినియోగదారుల దినోత్సవ కార్యక్రమానికి ఉండవల్లి మండలం బొంకూరు గ్రామంలో ఉన్న పలు సమస్యలపై గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి, కన్యధారశాంతి పిర్యాదు చేశారు.