Share News

వృత్తి నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు

ABN , Publish Date - Nov 04 , 2024 | 11:33 PM

వృత్తి నైపుణ్య శిక్షణ పొందిన వా రికి ఉపాధి అవకాశాలు ఉంటాయని డీవైఎస్‌వో శ్రీనివాస్‌ అన్నారు.

వృత్తి నైపుణ్య శిక్షణతో ఉపాధి అవకాశాలు

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): వృత్తి నైపుణ్య శిక్షణ పొందిన వా రికి ఉపాధి అవకాశాలు ఉంటాయని డీవైఎస్‌వో శ్రీనివాస్‌ అన్నారు. వృత్తినైపుణ్య శిక్షణ కేంద్రంలో వివిధ ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందిన 216 అభ్యర్థులకు సోమవారం డీఈవో పాత కార్యాల యంలో శిక్షణ కేంద్రంలో పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎస్‌వో పరీక్ష కేంద్రాన్ని పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ నిరుద్యోగ, యువతీ, యువకులకు బ్యుటీషియన్‌, ప్యాషన్‌ డిజైనింగ్‌, జర్దోషి, కంప్యూ టర్‌, ఏసీ మెకానిక్‌, మొబైల్‌ రిపేర్‌,సీసీ కెమెరా, హౌస్‌వైరింగ్‌ కోర్సుల్లో మూడు నెలల శిక్షణ అందజేశామని తెలిపారు. ఇప్పటికే 14 బ్యాచ్‌ల శిక్షణ పూర్తి చేశామని, 15వ విడత శిక్షణ ప్రారం భమైందన్నారు. కార్యక్రమంలో సెట్విన్‌ సూపరిం టెండెంట్‌ నవీన్‌కుమార్‌, శిక్షణ ఇన్‌చార్జీ సరిత, ఫాతిమాసుల్తాన, శ్రీనివాస్‌రావు, సీనియర్‌ అసి స్టెంట్‌ రవీందర్‌రెడ్డి, శిక్షణ కేంద్రం ఇన్‌చార్జీ విజయ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2024 | 11:33 PM