కులవాద నిర్మూలనే అంబేడ్కర్‌కు నిజమైన నివాళి
ABN , Publish Date - Dec 25 , 2024 | 11:10 PM
సమాజంలో కులవాదాన్ని పూర్తిగా నిర్మూలించడ మే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు నిజమైన నివాళి కాగలదని ప్రజాసంఘాల నాయ కులు తెలిపారు.
గద్వాల టౌన్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): సమాజంలో కులవాదాన్ని పూర్తిగా నిర్మూలించడ మే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు నిజమైన నివాళి కాగలదని ప్రజాసంఘాల నాయ కులు తెలిపారు. భిన్న జాతులు, సంస్కృతులకు నిలయంగా ఉన్న భారతీయ సమాజంలో సమై ఖ్యతకు విఘాతం కలిగించే మనువాదాన్ని నిర్భ యంగా తిరస్కరించాలని పిలుపునిచ్చారు. మ నువాదాన్ని అంబేడ్కర్ బహిరంగంగా దహనం చేసిన రోజును పురస్కరించుకుని బుధవారం ఆ యాపార్టీలు, ప్రజా సంఘాల నాయకులు స్థానిక అం బేడ్కర్ సర్కిల్ వద్ద మనుస్మృతి ప్రతులను దహనం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లా డుతూ 1927 డిసెంబరు 25న మహారాష్ట్రలోని కొలబా (ప్రస్తుతం రాయగఢ్) జిల్లాలోని మహద్ లోనూ మనుస్మృతులను బహిరంగంగా దహనం చేశారని గుర్తుచేశారు. మనువాదం పేరుతో దళితులు వెనుకబడిన వర్గాలను కించపరిచే సం స్కృతిని ప్రతీ ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. కులాలు, మతాల పేరుతో ప్రజలను వేరుచేసే మనువాదాన్ని స్వయంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిరసించడాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తిం చాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, పార్టీలు, ప్రజా, కులసంఘాల నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, మధు సూదన్ బాబు, మోహన్, అతిక్‌వుర్ రెహమాన్, వాల్మీకి, కోళ్ల హుసేన్, వినోద్, ఉప్పేరు నరసిం హ, వివి నరసింహా, ఇక్బాల్ బాషా, సుభాన్, కిష్టన్న, దానయ్య, సిద్ధార్థకృష్ణ, కురుమన్న, కార్తీక్, సాయిసవరన్, టవర్ మగ్బుల్, రవి, ప్రవీణ్, హనుమంతు, భూషణ, హరిబాబు, శ్రీధర్ తదిత రులు ఉన్నారు.