ఉత్సాహంగా గిరక బండ్ల పోటీలు
ABN , Publish Date - Apr 18 , 2024 | 11:15 PM
శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని ఈడిగోనిపల్లి, రాజోలి, ఇటిక్యాల మండలంలోని బట్లదిన్నె గ్రామాల్లో గురువారం నిర్వహించిన గిరక బండ్ల పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి.
అయిజ/ రాజోలి/ఇటిక్యాల, ఏప్రిల్ 18 : శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని ఈడిగోనిపల్లి, రాజోలి, ఇటిక్యాల మండలంలోని బట్లదిన్నె గ్రామాల్లో గురువారం నిర్వహించిన గిరక బండ్ల పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈడిగోని పల్లిలో నిర్వహించిన పోటీలను స్థానిక కాంగ్రెస్ నాయకుడు బడేసాబ్ ప్రారంభించారు. ప్రథమ స్థానాన్ని బోయగంగన్నకు చెందిన ఎద్దులు సొంతం చేసుకున్నాయి. ద్వితీయ స్థానంలో కోడిపుంజు తిమ్మప్పకు చెందిన ఎద్దులు, తృతీయ స్థానంలో బోయ చిన్నయ్యకు చెందిన ఎద్దులు నిలిచాయి. బుడన్‌సాబ్‌కు చెందిన ఎద్దులు నాలుగవ స్థానంలో, కోడిపుంజు మల్దకల్ ఎద్దులు ఐదవ స్థానాన్ని దక్కించుకున్నాయి. కార్యక్రమంలో గ్రామస్థులు చిన్నసోమన్న, లింగం, తిమ్మప్ప, మల్దకల్, పెద్ద వెంకట్రాములు, నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.
- రాజోలి, మండల కేంద్రంలోని రామాలయం ఆవరణలో ఎద్దుల గిరక బండ్ల పోటీలు నిర్వహించారు. పోటీలో తెలుగు నాగప్పకు చెందిన ఎద్దులు మొదటి బహుమతిని సొంతం చేసుకున్నాయి. రెండవ స్థానంలో వెంకటన్నకు చెందిన ఎద్దులు నిలిచాయి. విజేతలకు దాత సాయి నగదు బహుమతులను అందించారు. కార్యక్రమంలో డీ శ్రీనివాసులు, బాపిరెడ్డి పాల్గొన్నారు.
- ఇటిక్యాల మండలంలోని బట్లదిన్నె గ్రామంలో గురువారం ఎద్దుల గిరకబండ్ల పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. పోటీల్లో 16 జతల ఎద్దులు పాల్గొన్నాయి. గ్రామ రైతు కమిటీ అధ్యక్షుడు నారాయణ, సత్యారెడ్డిల ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు. కుచినెర్ల రాముడుకు చెందిన ఎద్దులు ప్రథమ స్థానంలో నిలిచాయి. మన్నాపురం రహీమ్‌కు చెందిన ఎద్దులు ద్వితీయ, కుచినెర్ల చిన్న హన్మంతు ఎద్దులు తృతీయ, ఆంజనేయులు, రూబేన్‌లకు చెందిన ఎద్దులు నాల్గవ స్థానాన్ని దక్కించుకున్నాయి. ఎద్దుల యజమానులకు ఎంపీటీసీ సభ్యుడు నూతన్, మాజీ సర్పంచు ఎస్తేరమ్మ, వెంకట్రామిరెడ్డి, లక్ష్మీదేవమ్మ బహుమతులు అందించారు. కార్యక్రమంలో గ్రామస్థులు వాసుగౌడ్, మద్దిలేటి గౌడ్, వెంకటేష్‌గౌడ్, ప్రసాద్ పాల్గొన్నారు.