అజాత శత్రువు మాజీ ప్రధాని వాజపేయి
ABN , Publish Date - Dec 25 , 2024 | 11:19 PM
భారతరత్న, సుపరిపాలనకు మారుపేరైన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి అజాత శత్రువని బీజేపీ రాష్ట్ర నా యకుడు నాగురావు నామాజీ అన్నారు.
- బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ
- ఘనంగా వాజపేయి జయంతి
- పూలమాలలతో ఘన నివాళి
నారాయణపేట/మక్తల్/ మరికల్/మాగనూరు/ కొత్తపల్లి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): భారతరత్న, సుపరిపాలనకు మారుపేరైన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి అజాత శత్రువని బీజేపీ రాష్ట్ర నా యకుడు నాగురావు నామాజీ అన్నారు. బుధవారం పేట బీజేపీ జిల్లా కార్యాలయంలో వాజపేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నామాజీ మా ట్లాడుతూ వాజపేయిని ఆదర్శంగా తీసుకుని ప్రతీ కార్యకర్త పార్టీ పటిష్టతకు పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రఘురామయ్యగౌడ్, సత్యయాదవ్, లక్ష్మీశ్యాంసుందర్, మిర్చివెంకటయ్య, నందునామాజీ, రాము, రఘువీర్‌యాదవ్, సైదప్ప తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా, మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయం వద్ద వాజపేయి చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వచ్ఛభారత్, అన్నదాన కార్యక్రమం, ప్ర భుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పం పిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు కొండయ్య, స్థానిక నాయకులు కర్నిస్వామి, బలరాంరెడ్డి, కల్లూరినాగప్ప, డి.నర్సింహారెడ్డి, చీరాల సత్యనారాయణ, సూర్య ఆంజనేయులు, రాంమాధవ్, నర్సిములు, సురేందర్, నరేందర్, సుకన్యశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మరికల్ మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో వాజపేయి చిత్రపటానికి బీజేపీ నా యకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి చిన్ననర్సన్ గౌడ్, సభ్యత్వ నమోదు కన్వీనర్ లక్ష్మీకాంత్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, వేణు, రమేష్, శ్రీధర్, నరేష్, వెంక టేష్ తదితరులున్నారు.
మాగనూరులోని అంతర్జాతీయ రహదారి డివైడర్‌పై ఏర్పాటుచేసిన వాజపేయి చిత్ర పటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ మండల అధ్యక్షుడు గొల్ల నారాయణ, మాజీ అధ్యక్షుడు జయనందారెడ్డి, ఓబీసీ జిల్లా జనరల్ సెక్రటరీ వాకిటి మల్లేష్, పూజారి ప్రభు, వెంకటేష్‌గౌడ్, వెంకటేష్‌చారి తదితరులున్నారు.
కొత్తపల్లి మండలం భూనీడు గ్రామంలో వాజ పేయి చిత్రపటానికి బీజేపీ మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళు లర్పించారు. కొట్ల మహేందర్‌రెడ్డి, మహిపాల్‌గౌడ్, బోడ వెంకటేష్, యాదిరెడ్డి, నవకాంత్‌రెడ్డి, క మ్మరి శివ, కె.వెంకటేష్, నరేష్ తదితరులున్నారు.