Share News

కుటుంబాలను పక్కాగా గుర్తించాలి

ABN , Publish Date - Nov 06 , 2024 | 11:34 PM

రాష్ట్ర ప్రభుత్వం చేప ట్టిన కుటుంబ సర్వేలో భాగంగా గ్రామాల్లో కుటుంబాలను పక్కా గా గుర్తించాలని వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అన్నారు.

కుటుంబాలను పక్కాగా గుర్తించాలి
ఆత్మకూరులో నిర్వహించిన కుటుంబ సర్వేలో అధికారులకు సూచనలు ఇస్తున్న వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

- కుటుంబ సర్వేలో తప్పొప్పులకు తావివ్వొద్దు

- వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

ఆత్మకూరు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం చేప ట్టిన కుటుంబ సర్వేలో భాగంగా గ్రామాల్లో కుటుంబాలను పక్కా గా గుర్తించాలని వనపర్తి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అన్నారు. ఆత్మకూ రు మండలంలోని ఖానాపూర్‌, బాలకృష్ణాపూర్‌ గ్రామాల్లో అధికా రులు చేపడుతున్న సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి గ్రామాల్లో తమకు నిర్దేశిం చిన కుటుంబాలను పక్కాగా గుర్తించాలని తెలిపారు. ఎవరైనా బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళితే పంచాయతీ కార్యదర్శులు చాటింపు వేయించి కుటుంబ సర్వే నాటికి గ్రామానికి చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 8వ తేదీ వర కు కుటుంబాలను గుర్తించి 9వ తేదీన ఉదయం సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా ఆత్మకూరు పట్ట ణంలోని వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబోసుకున్న ధాన్యాన్ని పరిశీలించారు. దొడ్డు, సన్న రకం వడ్లను సరిగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు మండల ప్రత్యేక అధికారి బీరం సుబ్బా రెడ్డి, తహసీల్దార్‌ చాంద్‌పాషా, మునిసిపల్‌ కమిషనర్‌ శశిధర్‌, ఎంపీడీవో సుజాత, ఎంపీవో శ్రీరాంరెడ్డి, మండల వ్యవసాయ అధికారి వినయ్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 11:34 PM