కలెక్టరేట్‌లో రైతు ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Dec 02 , 2024 | 11:43 PM
తన భూమిని సొంత అన్న సాగు చేసుకోనివ్వ కుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమ వారం వనపర్తి కలెక్టరేట్‌లో చోటుచేసుకున్నది.
- భూ వివాదంతో అఘాయిత్యం
వనపర్తి క్రైం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : తన భూమిని సొంత అన్న సాగు చేసుకోనివ్వ కుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమ వారం వనపర్తి కలెక్టరేట్‌లో చోటుచేసుకున్నది. గోపాల్‌పేట మండలం ఏదుట్ల గ్రామానికి చెంది న రైతు సాయిరెడ్డికి తన గ్రామంలోని సర్వే నెంబరు 135లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ముగ్గురు అన్నదమ్ముల భాగపరి ష్కారంలో భాగంగా తనకు వచ్చిన రెండెకరాల భూమితో పాటు మరో సోదరుడికి సంబంధించి న రెండెకరాల పొలాన్ని కొనుగోలు చేశాడు. అయితే ఆ భూమిని సాగు చేసుకోని వ్వకుండా తన సొంత అన్న శేఖర్‌రెడ్డి దంపతులు, కుమా రుడు లింగారెడ్డి, కుమార్తె శశికళ ఎనిమిదేళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించాడు. అన్నదమ్ముల భాగస్వామ్యంలో వేసుకున్న బోరును కూడా వాడుకోనివ్వడం లేదని పలుమా ర్లు గోపాల్‌పేట తహసీల్దార్, కలెక్టరేట్‌లో ఫిర్యా దు చేశాడు. అయినా సమస్య పరిష్కారం కాలే దు. దీంతో విసుగు చెందిన శేఖర్‌రెడ్డి సోమవా రం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో మరోసారి ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. అతను ప్రజా వాణి హాల్ లోపలికి వెళుతుండగా ఫిర్యాదు కాపీ ని వెనుక నుంచి ఓ వ్యక్తి తీసుకొని వెళ్లాడు. అప్పటికే సాయిరెడ్డి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల ఉన్నవారు విషయాన్ని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లా రు. ఆయన ఆదేశంతో పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై ప్రభు త్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి రెడ్డిని సంప్రదించగా తన సొంత అన్న శేఖర్‌రెడ్డి అధికార పార్టీ అండదండలతో తన సొంత పొ లంలోకి వెళ్లడానికి దారి ఇవ్వకుండా ఇబ్బండి పెడుతున్నాడని అన్నారు. ఈ సమస్యను తహసీ ల్దార్ దృష్టికి తీసుకువెళ్లితే రాజకీయ ఒత్తిడి ఉన్నదని సమాధానం చెప్పినట్లు తెలిపారు. గ తంలో కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదన్నారు. కొన్నేళ్లుగా ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో విసుగు చెంది పురుగుల మందు తాగినట్లు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. ప్రస్తుతం రైతు సాయిరెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నది.