ఉదండాపూర్ రైతులు ఆందోళన చెందొద్దు
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:17 PM
ఉదండాపూర్ రైతులు ఆందోళన చెందవద్దని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నా రు.
-ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులు, ముంపువాసుల బాధలపై ఉత్తమ్‌కు లేఖ రాస్తా
- ఎంపీ డీకే అరుణ
జడ్చర్ల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : ఉదండాపూర్ రైతులు ఆందోళన చెందవద్దని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నా రు. జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామం లో బుధవారం రిజర్వాయర్ నిర్వాసితులు, ముంపువాసులను కలుసుకున్నారు. ఈ సం దర్బంగా ఆమె మాట్లాడుతూ ఉదండాపూర్ నిర్వాసితులు, ముంపువాసుల బాధలు తెలు సు అని అన్నారు. పునరావాసం కింద రూ.25 లక్షల ప్యాకేజీ చెల్లించిన అనంతరమే ప్రాజెక్టు పనులు మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతులంతా కలిసికట్టు గా ఉండాలని, లేనిపక్షంలో మోసపోతారని సూచించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అధికారి పా ర్టీకి చెందిన వారేనని, న్యాయం చేసేవిధంగా చర్యలు తీ సుకోవా లని కోరారు. ఉదం డాపూ ర్ రిజర్వాయ ర్ నిర్వాసితులు, ముంపువాసుల బా ధలపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కు లేఖ రా స్తానన్నారు. ఇవ్వా ల్సిన పరిహారం అం శంపై ఇరిగేషన్ శా ఖ మంత్రితో పలు పర్యాయాలు మాట్లాడానని చెప్పారు. 2016 లో భూసేకరణ చేశారని, నాడు-నేడు భూ ముల ధరలకు ఒకే విధంగా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఉదండాపూర్‌లో అర్హులైన విశ్వ కర్మ లోన్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ని ర్వాసితులకు కొందరికి ఇచ్చి మరికొందరికి ఇ వ్వకపోవడంతో విభజించు.. పాలించు అన్న ట్లుగా వ్యవహరించడం భావ్యం కాదన్నారు. పాలమూరు ప్రాజెక్టు తెచ్చింది తానే అని వె ల్లడించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపో తల పథకం సర్వే జీవో ఇప్పించింది తన హ యాంలోనే అని తెలిపారు. జూరాల నుంచి నీళ్లు తీసుకురావాలని డీపీఆర్ ఇచ్చామని, జిల్లాలోని అన్ని ప్రాంతాల అభివద్ధే లక్ష్యంగా డిజైన్ తయారు చేసినట్లు తెలిపారు. బీ ఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన అనంతరం డీపీఆర్ మార్చడంతో ప్రాజెక్టు ఆ లస్యం అ య్యిందని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణాని కి కేంద్రం 60 శాతం నిధులు ఇస్తామని ఒప్పుకుందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పాలమూరుకు జాతీయ హోదా ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు.