రైతులు ధాన్యం ఆరబెట్టి తీసుకురావాలి
ABN , Publish Date - Nov 10 , 2024 | 11:33 PM
మండలంలోని దండు వద్ద కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్ ఆదివారం పరిశీలించారు.
మక్తల్ రూరల్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని దండు వద్ద కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్ ఆదివారం పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యాన్ని తేమ, తాలు లేకుండా కేంద్రాలకు తీసుకొని రావాలని సూచించారు. రైతులు ధాన్యాన్ని తేమ శాతం 17 కంటే తక్కువ ఉండేలాగా, ఆరబెట్టుకుని రావాలని సూచిం చారు. ఏవో మిథున్‌చక్రవర్తి, ఏఈవో చం దన పాల్గొన్నారు.
మక్తల్: వ్యవసాయ మార్కెట్‌కు ఆదివారం వరిధాన్యం రావడంతో మార్కెట్ కళకళలాడింది. సన్నరకం వరిధాన్యానికి గరిష్టంగా రూ.2,536, కనిష్టంగా రూ.2,341 ధర వచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. రైతులు వరిధా న్యాన్ని తీసుకువచ్చి మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని కార్యదర్శి కోరారు.