రైతులకు ఇబ్బందులు కలుగనీయొద్దు
ABN , Publish Date - Nov 07 , 2024 | 11:09 PM
రైతులు పండించిన వరిని కొనుగోలు కేం ద్రాలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
- కలెక్టర్ బదావత్ సంతోష్
తాడూరు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : రైతులు పండించిన వరిని కొనుగోలు కేం ద్రాలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం మండలం లోని సిర్సవాడలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని కలె క్టర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం జిల్లా వ్యాప్తంగా 253 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈసారి సన్నరకం, దొడ్డురకం ధాన్యం సేకరణకై వేర్వేరుగా కేంద్రాలను అందుబాటులోకి ఉంచామని వివరించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధా న్యాన్ని వెంట నిర్దేశిత రైస్ మిల్లులకు తర లించే ప్రక్రియను వే గవంతం చేశామన్నా రు. ధాన్యం సేకరణ లో తాలు, తరుగు, తే మ వంటివి నియం త్రించాలని, ప్రతి ధా న్యం కేంద్రానికి ధాన్యా న్ని శుభ్రం చేసే యం త్రాలు ఏర్పాటు చే యాలని ముఖ్యంగా మెకనైజ్డ్ క్లీనర్లు ఏర్పా టు చేయాలన్నారు. ధాన్యం సేకరణ వేగ వంతం చేయాలని, కొనుగోలు చేసిన ధా న్యాన్ని తక్షణమే తరలించాలన్నారు. సన్న, దొడ్డు రకాలను వేర్వేరుగా గుర్తించి కొనుగో లు చేయాలని, ధాన్యం సేకరణలో రైతుల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేకుండా చూసుకోవాలని, లీగల్ మెట్రాలజీ అధికా రులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి కాంటా లను తనిఖీ చేయాలని ఆదేశించారు. కలె క్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల శాఖ అధి కారులు శ్రీనివాస్, రాజేందర్, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.