Share News

క్రీడలతో స్నేహభావం

ABN , Publish Date - Dec 07 , 2024 | 11:18 PM

క్రీడలతో క్రీడాకారుల మధ్య స్నేహభావం పెంపొందుతోందని అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ అన్నారు.

క్రీడలతో స్నేహభావం
మూసాపేటలో టాస్‌వేసి క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌

- అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌

- సీఎం కప్‌ క్రీడా పోటీలు ప్రారంభం

మూసాపేట, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : క్రీడలతో క్రీడాకారుల మధ్య స్నేహభావం పెంపొందుతోందని అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పాఠశాల మైదానంలో నిర్వహించిన సీఎం కప్‌ క్రీడా పొటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనంలో నాణ్యత పాటించాలని, ప్రతీ రోజు ముందుగా ఉపాధ్యాయులు పరిశీలించిన తర్వాతే విద్యార్థులకు భోజనం పెట్టాలని, బియ్యం, కూరగాయల నాణ్యతను కూడా పరిశీలించాలన్నారు. ఎంపీడీవో కృష్ణయ్య, ఏంపీవో అనురాధ, పంచాయతీ కార్యదర్శి మహేందర్‌, పీఈటీ సుగుణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

గండీడ్‌/మహమ్మదాబాద్‌ : చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని డీఈవో ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. శనివారం గండీడ్‌ మండలం వెన్నాచేడ్‌ జిల్లా ఉన్నత పాఠశాలలో సీఎం కప్‌ పోటీలను ప్రారంభం చేశారు. అదే విధంగా మహమ్మదాబాద్‌ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసి, మధ్యాహ్న భోజనం పరిశీలించారు. సీఎంవో బాలుయాదవ్‌, ఎంఈవో జనార్దన్‌, , పీడీలు రామునాయక్‌, ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 11:18 PM