నిండా నిర్లక్ష్యం!
ABN , Publish Date - Sep 12 , 2024 | 11:22 PM
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు గ్రహణం పట్టుకుంది.
- ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు గ్రహణం!
- కొన్ని మార్కెట్లు రూ. కోట్ల వ్యయంతో నిర్మించినా నిరుపయోగం
- మరి కొన్నింటిని మధ్యలోనే వదిలేసి అధికారుల చోద్యం
- రోడ్లపైనే కూరగాయలు, మాంసం విక్రయాలతో ఇబ్బంది
- ఉమ్మడి పాలమూరులోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి
- కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక.. నిర్మాణ పనుల నిలిపివేత
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు గ్రహణం పట్టుకుంది. రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన కొన్ని మార్కెట్లను సంవత్స రాలుగా ఉపయోగంలోకి తీసుకురాకపోగా.. నిర్మాణం లో ఉన్న మార్కెట్లను నిర్లక్ష్యం చేసి.. కాంట్రాక్టర్లకు బి ల్లులు చెల్లించకపోవడంతో పనులను నిలిపివేసిన దు స్థితి నెలకొంది. గత ప్రభుత్వం రోడ్లపైన కూరగాయ లు, పండ్లు, మాంసం, చేపలు విక్రయించకుండా ఉం డటం కోసం చిరు వ్యాపారులకు సమీకృత వెజ్, నా న్‌వెజ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆ యా జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లోని ప్రైమ్ ఏరి యాల్లో రూ. కోట్లు విలువ చేసే స్థలం కేటాయించా రు. కానీ ఇప్పటివరకు ఎక్కడా పూర్తిస్థాయిలో మార్కె ట్లను అందుబాటులోకి తీసుకురాలేదు. ఇంకా చిరువ్యా పారులు రోడ్లపైనే విక్రయాలను కొనసాగిస్తున్నారు. దీనివల్ల అటు వాహనదారులకు ఇబ్బందులు ఎదుర వుతుండగా.. ఇటు రోడ్లపైన దుమ్ముధూళితో శుభ్రమై న కూరగాయలు, పండ్లు ప్రజలకు లభించడం లేదు. ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లలో కూరగాయలు, పండ్లు, సూపర్ మార్కెట్, బ్యాంకు, మాంసం విక్రయాల కోసం అనేక వసతులను కల్పించగా.. వాటిని వినియో గంలోకి తీసుకువస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి. గత ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ నిర్మా ణాలను పూర్తిగా అటకెక్కించారు. కాంట్రాక్టర్లు పను లు వదిలేసి వెళ్లగా.. నిర్మాణాలు చివర్లో ఉన్నవాటిని ఇతర అవసరాల కోసం వినియోగించడానికి ప్రస్తుత పాలకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిర్మించి.. వదిలేశారు...
నారాయణపేట జిల్లాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 8 కోట్లు వెచ్చించింది. ఈ మార్కెట్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం కూడా పూర్తయ్యింది. అయినా దుకాణాల కేటాయింపు విషయంలో పట్టింపు లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. గతంలో అప్పటి సీఎం కేసీఆర్ ఈ మార్కెట్ మోడల్ బాగుందని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే మోడల్‌ను అనుసరించాలని ప్రతిపాదించారు. ఈ మార్కెట్‌ను నిర్మించిన కాంట్రాక్టర్‌కు రూ. 1.20కోట్లు మాత్రమే చెల్లించగా.. మిగతా మొత్తం పెండింగ్‌లో ఉంది. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాత గంజ్‌లో సెప్టెంబరు 29, 2021న అప్పటి మార్కెటింగ్ శాఖ మంత్రి రూ. 19 కోట్లతో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌కు శంకుస్థాపన చేయగా.. రెండేళ్లలో నిర్మాణం పూర్తిచేశారు. దాదాపు సంవత్సరకాలంగా ఆ మార్కెట్ వృథాగా ఉంది. ఇటీవల దుకాణాల అద్దె కోసం చర్యలు చేపట్టారు. ఇదే జిల్లాలో సింజెంట కంపెనీ క్లీన్ అండ్ గ్రీన్ నిధులు రూ. 2.80 కోట్లతో పెబ్బేరు రోడ్డులో వే సైడ్ మార్కెట్‌ను 2021లో శంకుస్థాపన చేశారు. 2023లో సింజెంట గ్లోబల్ ప్రతినిధుల స మక్షంలో ప్రారంభించారు. ఇందులో 78 దుకాణాలు ఉండగా.. క్యాంటీన్, బేబీ పీడింగ్, పిల్లలు ఆడుకోవడానికి పార్కు వంటి సౌక ర్యాలు ఏర్పాటు చేశారు. ప్రారంభించింది మొదలు.. నేటి వరకు వినియోగంలోకి తీసుకురాలేదు. ఆ రోజు కొందరు వ్యాపారులను తీసుకువచ్చి ప్రారంభించగా.. తర్వాత వదిలేశారు. జన సంచారం ఎక్కువగా ఉన్న దారుల్లో కాకుండా ఊరికి దూరంగా వేసైడ్ మార్కెట్ నిర్మించడం వల్లనే వ్యాపారులు ఎవరూ వెళ్లడం లేదు. బలవంతంగా ఒకరిద్దరిని తరలించినా.. వారు అక్కడ వ్యాపారం చేయడానికి అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. గద్వాల జిల్లా కేంద్రంలో రూ. 12 కోట్లతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను 90శాతం పూర్తిచేశా రు. కాంట్రాక్టర్‌కు 60శాతం బిల్లులు చెల్లించారు. అక్క డ మంచినీరు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల కోడ్‌కు ఒక్కరోజు ముందు హడా విడిగా ప్రారంభించారు. కానీ ఇప్పటివరకు వినియో గంలోకి తీసుకురాలేదు.
పనుల నిలిపివేత...
మహబూబ్‌నగర్ జిల్లాలో మోడ్రన్ రైతు బజార్ పేరిట 2018లో అబ్దుల్ ఖాదర్ దర్గా వద్ద మార్కెట్ నిర్మాణం చేపట్టారు. రూ. 5.50 కోట్లు కేటాయించగా.. అందుకు రూ. 3.37కోట్లు ఖర్చు చేసి.. గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిచేసి వినియోగంలోకి తెచ్చారు. మిగతా పనులను అలాగే వదిలేశారు. అలాగే ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ పట్టణంలో మూడు మార్కెట్ల నిర్మాణాలను ప్రారంభించారు. మెట్టుగడ్డ వద్ద ఎకరా స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను రూ. 5.5 కోట్లతో ప్రారంభించగా.. ఫినిషింగ్ వర్క్స్ చేయాల్సి ఉంది. అయితే ఈ భవనాన్ని ఇతర అవసరాల కోసం వినియోగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత రైతుబజార్ వద్ద మరో 2వేల చదరపు అడుగుల్లో వెజ్ మార్కెట్ నిర్మాణం చేపట్టగా.. స్లాబ్ మాత్రమే వేసి.. వదిలేశారు. పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద 2019లో రూ. 6 కోట్లతో ఎకరా విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణం చేపట్టారు. రెండు ఫ్లోర్ల నిర్మాణం జరిగిన తర్వాత పనులు ఆగిపోయాయి. జడ్చర్ల పట్టణంలో రూ. కోటితో రైతు బజార్ నిర్మాణం చేపట్టారు. అది నిరుపయోగంగా మారింది. అలాగే ఇదే పట్టణంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. బిల్లులు రాకపోవడంతో పనులు ఫిల్లర్ల దశలోనే ఆగిపోయాయి. నాగర్‌కర్నూలు జిల్లాలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కె ట్‌ను పాత గంజ్‌లో రూ.ఏడు కోట్లతో చేపట్టారు. అప్పటి పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయగా.. ఇంకా పనులు పూర్తికాలేదు. రూ. 1.50 కోట్ల బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది.