Share News

బృందావన్‌ గార్డెన్‌కు నిధులు కేటాయించాలి

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:05 PM

ధరూరు మండలం రేవులపల్లి గ్రామ సమీపంలోని జూరాల ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేస్తున్న బృందావనం గార్డెన్‌ అభివృద్ధికి నిధులు కేటాయించాలని

బృందావన్‌ గార్డెన్‌కు నిధులు కేటాయించాలి
టూరిజం సెక్రటరీకి వినతిపత్రం ఇస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే

- ఎంపీ రాములు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల న్యూటౌన్‌/ ధరూరు, ఫిబ్రవరి 6 : ధరూరు మండలం రేవులపల్లి గ్రామ సమీపంలోని జూరాల ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేస్తున్న బృందావనం గార్డెన్‌ అభివృద్ధికి నిధులు కేటాయించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎంపీ రాములు కోరారు. సోమవారం ఆయన ఎంపీ రాములుతో కలిసి ఢిల్లీలో నేషనల్‌ టూరిజం సెక్రటరీ విద్యావతికి వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ స్వదేశీ దర్శన్‌ పథకంలో భాగంగా బృందావన్‌ గార్డెన్‌ అభివృద్ధికి మరో రూ.84 కోట్లు కేటాయించాలని కోరారు. మూడు రాష్ట్రాలతో సంబంధమున్న నడిగడ్డలో చారిత్రక ప్రఖ్యాతి గాంచిన పట్టుచీరలకు, ప్రాచీన కోటలకు, కృష్ణానది పరివాహకంలోని దేవాలయాలకు, ఇతర పర్యాటక ప్రదేశాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలిపారు. ఈ ప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు సెక్రటరీ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.

Updated Date - Feb 06 , 2024 | 11:05 PM