Share News

మొబైల్‌ ఫోన్ల రికవరీలో రాష్ట్రంలో గద్వాల జిల్లాకు ఐదో స్థానం

ABN , Publish Date - Nov 05 , 2024 | 11:40 PM

సీఈఏఆర్‌ ద్వారా మొబైల్‌ ఫోన్ల రికవరీ శాతంలో రాష్ట్రంలో జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు ఐదోస్థానంలో ఉన్నట్లు మంగళవారం ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

 మొబైల్‌ ఫోన్ల రికవరీలో రాష్ట్రంలో గద్వాల జిల్లాకు ఐదో స్థానం
డీజీపీ చేతులమీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకుంటున్న ఐటీసెల్‌ ఎస్‌ఐ రజిత

- అభినందించిన డీజీపీ జితేందర్‌

గద్వాలక్రైం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): సీఈఏఆర్‌ ద్వారా మొబైల్‌ ఫోన్ల రికవరీ శాతంలో రాష్ట్రంలో జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు ఐదోస్థానంలో ఉన్నట్లు మంగళవారం ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. హైదరా బాద్‌ లో మంగళ వారం డీజీపీ జితేందర్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా పరిధిలో ఏప్రిల్‌-2023 నుంచి ఆక్టోబరు- 2024 వరకు జిల్లా వ్యాప్తంగా 948 సెల్‌ఫోన్‌లను గుర్తించి స్వాధీనం చేసుకొని సెల్‌ఫోన్‌ యజమానులకు అందజేశామన్నారు. సెల్‌ఫోన్‌లను గుర్తించి రికవరీ చేయడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు ఎస్పీ శ్రీనివాసరావును, జిల్లా పోలీస్‌ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి ఐటీసెల్‌ ఇన్‌చార్జి ఎస్‌ఐ రజితకు ప్రశంసాపత్రాన్ని అందించారు..

Updated Date - Nov 05 , 2024 | 11:41 PM