Share News

చిన్నారులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి

ABN , Publish Date - Nov 14 , 2024 | 11:24 PM

నేటి పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

చిన్నారులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి
బాలసదనంలో చిన్నారులతో కేక్‌ కట్‌ చేయిస్తున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌/అయిజ/టౌన్‌/మల్దకల్‌/ఇటిక్యాల/రాజోలి/వడ్డేపల్లి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : నేటి పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. చిల్డ్రన్స్‌ డే సందర్భంగాగురువారం జిల్లా కేంద్రంలోని బాల సదనంలో స్ర్తీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కేక్‌ కట్‌ చేయించి, శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రు జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషమన్నారు. పిల్లల అభ్యాసం, సమగ్ర అభివృద్ధికి బాలసదన్‌ మంచి గుణాత్మ విద్యతో పాటు వివిధ కార్యక్రమాలు అందిస్తోందన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్ధ గంట కవితాదేవి మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్నారు. అనంతరం నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు కలెక్టర్‌, న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి మెమొంటోలు, స్కూల్‌ బ్యాగ్స్‌ను పంపిణీ చేశారు. అదే విధంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి నెహూ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. శిశు, సంక్షేమాధికారి సుధారాణి, డీడబ్ల్యూసీ చైర్మన్‌ సహదేవులు, సభ్యురాలు శైలజ, కోఆర్డినేటర్‌ నర్సింహ్మ ఉన్నారు. అయిజ మండల మేడికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని జీహెచ్‌ఎం పచ్చర్ల తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అయిజ మునిసిపాటీలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఎంఈవో రాములు ఆధ్వర్యంలో బాలల దినోత్సవం నిర్వహించారు. మల్దకల్‌ మండలం అమరవాయి ఉన్నత పాఠశాలలో గురువారం బాలల దినోత్సవంతో పాటు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. తల్లిదండ్రుల సమావేశంలో హెచ్‌ఎం నరేశ్‌ మాట్లాడుతూ విద్యార్థులను తప్పనిసరిగా పాఠశాలకు పంపాలన్నారు. అనంతరం జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇటిక్యాల మండలం జింకలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో రేణుక ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఇటిక్యాల, చాగాపురం, కొండేరు, షాబాద్‌, ఉదండాపురం గ్రామాల్లో బాలల దినోత్సవం జరుపుకున్నారు. రాజోలి జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్‌ ఆవరణలో మానవహారం చేపట్టారు. వీవర్స్‌కాలనీలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు చిరంజీవి ఫ్యాన్సు పలకలు పంపిణీ చేశారు. మండలంలోని తూర్పు గార్లపాడు పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. వడ్డేపల్లి మండలం రామాపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం నరసింహ ఆధ్వర్యంలో నెహూ జయంతిని ఘనంగా నిర్వహించారు.

Updated Date - Nov 14 , 2024 | 11:24 PM