Share News

క్రీడా రంగానికి ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం

ABN , Publish Date - Nov 05 , 2024 | 11:37 PM

గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామీణ ప్రాం తాల్లో క్రీడారంగానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆధిక ప్రాధాన్యత కల్పిస్తూ పెద్దపీట వేస్తుందని స్థానిక ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు.

క్రీడా రంగానికి ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం

- వేములలో వాలీబాల్‌ స్టేడియంను ప్రారంభించిన శాట్స్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే

మూసాపేట, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామీణ ప్రాం తాల్లో క్రీడారంగానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆధిక ప్రాధాన్యత కల్పిస్తూ పెద్దపీట వేస్తుందని స్థానిక ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. మంగళ వారం సాయంత్రం మండలంలోని వేముల గ్రా మంలో ఏర్పాటు చేసిన వాలీబాల్‌ స్టేడియాన్ని ఆయనతో పాటు షాట్స్‌ చైర్మన్‌ శివసేనారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి క్రీడా రంగాన్ని ప్రోత్సహించడానికి ఆ శాఖకు రూ.364 కోట్ల నిధులు కేటాయించారని, జిల్లాలో స్పోర్ట్స్‌ యూ నివర్సిటీ, నియోజకవర్గానికి ఇండోర్‌ స్టేడియం ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకా రులను వెలికితీయడానికి రాష్ట్రవ్యాప్తంగా సీఎం కప్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్య క్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు బాలనర్సిం హులు, మాజీ ఎంపీపీ బగ్గికృష్ణయ్య, మాజీ ఎం పీటీసీ సభ్యుడు సత్యనారాయణ, నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అఽధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, రవిరాజాచారి, సుధాకర్‌, కాశీమ్‌, గణేష్‌, నర్సిం హులు, సారే తిరుపతయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 05 , 2024 | 11:37 PM