Share News

తేమశాతం17 ఉన్నా ధాన్యం కొనాలి

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:33 PM

నాణ్య తతో ఉండి 17లోపు తేమ శాతం ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలనికలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు.

తేమశాతం17 ఉన్నా ధాన్యం కొనాలి

మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ విజయేందిర బోయి

హన్వాడ, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): నాణ్య తతో ఉండి 17లోపు తేమ శాతం ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలనికలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు. బుధవారం హన్వాడలోని సొసైటీ బ్యాంక్‌ ముందున్న వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమ స్యలు తెలుసుకున్నారు. తేమను, సన్న, దొడ్డుర కం వరి ధ్యాన్యాన్ని పరిశీలించి నిర్వాహకు లతో మాట్లాడారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో డబ్బులు అందిం చాలని ఆదేశించారు. అమెతో పాటు డీటీ వెంకటేశ్వర్లు, డైరెక్టర్‌ శ్రీనివాసులు, శ్రీను పాల్గొన్నారు.

పరిశ్రమలకు అనుమతులు గడువులోపే ఇవ్వాలి: కలెక్టర్‌

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, నవంబరు20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామి కవేత్తలను ప్రోత్సహిస్తూ టి.జి.ఐపాస్‌ ద్వారా పరిశ్రమ స్థాపనకు వివిధ శాఖల నుంచి మం జూరు చేయవలసిన అనుమతులను నిబంధ నల మేరకు నిర్ధేశిత గడువులోగా మంజూరు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ విజయేందిర బోయి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి హాజరైన ఆమె మాట్లా డారు. టీఫ్రైడ్‌ ద్వారా షెడ్యూల్‌ కులాల వారికి ట్రాక్టర్‌ అండ్‌ ట్రైలర్‌ వాహనాలు 9 మందికి, షెడ్యూల్‌ తెగల వారకి 8మందికి ట్రాక్టర్‌ అం డ్‌ ట్రైలర్స్‌ కు, టాటా ఎస్‌, మారుతీ డిజైనర్‌ వాహనాలకు, పెట్టుబడి సబ్సిడీ, సర్వీస్‌ సెక్టార్‌ ఒకరికి పావలావడ్డీ మంజూరుకు కమిటీలో ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరి శ్రమల జనరల్‌ మేనేజర్‌ పి.ప్రతాప్‌, ఎల్‌డీఎం కాల్వ భాస్కర్‌, భూగర్భ జలవనరుల శాఖ రమాదేవి, కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్‌ సురేష్‌, మోటార్‌ వెహిక ల్‌ ఇన్‌స్పెక్టర్‌ రఘు, పాల్గొన్నారు.

మాతృ మరణాలు తగ్గించాలి

వివిధ కారణాల వల్ల జరుగుతున్న మాతృ మరణాలు తగ్గించుటకు చర్యలు తీసుకోవాల ని కలెక్టర్‌ విజయేందిర బోయి జిల్లా వైద్యాధి కారులను ఆదేశించారు. మార్చి నుండి ఈనెల వరకు మాతృమరణాలపై బుధవారం ఆమె కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో సమీక్ష సమావే శం నిర్వహించారు. ఆశ వర్కర్‌ మొదలు కొని జిల్లా వైద్యాధికారుల వరకు అప్రమత్తంగా ఉం డాలని సూచించారు. సమావేశంలో డీఎం హెచ్‌వో డాక్టర్‌ క్రిష్ణ, డాక్టర్‌ భాస్కర్‌ నాయక్‌, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌, గైనకాలజిస్ట్‌, ఫిజిషియన్‌, జిల్లా మాస్‌ మీడి యా అధికారి, జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా పబ్లిక్‌ హెల్త్‌ నర్సింగ్‌ అధికారి పాల్గొన్నారు.

డేటా ఎంట్రీ జాగ్రత్తగా చేయాలి

సర్వే డేటా ఎంట్రీ జాగ్రత్తగా చేయాలని కలెక్టర్‌ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు డేటా ఎంట్రీపై జిల్లా మేనేజర్‌ చంద్రశేఖర్‌ శిక్షణ ఇచ్చారు. ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ వా రితో మాట్లాడుతూ ఈ రోజు సాయంత్రం మండల లాగిన్‌లకు యూజర్‌ ఐడీ, పాస్‌వ ర్డ్‌లను ఈడీఎం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వెంటనే డేటా ఎంట్రీ డెమో నిర్వ హించాలని చెప్పారు. వివరాలను గోప్యంగా ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 11:33 PM