Share News

వివాహితపై అత్తింటి వారి వేధింపులు

ABN , Publish Date - Dec 19 , 2024 | 11:12 PM

అదనపు కట్నం వేధింపు కేసులో ఆరుగురికి జైలు శిక్షతోపాటు, జరిమాన కోర్టు విధించిందని సీఐ దస్రునాయక్‌ గురవాఆరం తెలిపారు.

వివాహితపై అత్తింటి వారి వేధింపులు

- ఆరుగురికి జైలు శిక్ష

మద్దూర్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): అదనపు కట్నం వేధింపు కేసులో ఆరుగురికి జైలు శిక్షతోపాటు, జరిమాన కోర్టు విధించిందని సీఐ దస్రునాయక్‌ గురవాఆరం తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. మద్దూర్‌ మండలంలోని దంగాన్‌పూర్‌ చెందిన మునిరాబేగంను కోస్గి మండలంలోని ముష్రిషా గ్రామానికి చెందిన అబ్దుల్‌ రజాక్‌తో 15ఏళ్ల క్రితం వివాహమైంది. 2008లో భర్త అబ్దుల్‌ రజాక్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భర్త పేరున వచ్చిన ఇన్సూరెన్స్‌ డబ్బులు భార్య మునిరాబేగంకు అత్తమామలు ఇవ్వకుండా తనను వేధిస్తున్నారని అక్టోబరు 3, 2017న మునిరాబేగం మద్దూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి హెడ్‌కానిస్టేబుల్‌ ఆంజనేయులు కేసు నమోదు చేయగా ఎస్‌ఐ యాదగిరి దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్‌ నమోదు చేశారు. గురువారం సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయాధికారి ఫర్హిన్‌బేగం ఈ కేసులో నిందితులైన ఆరుగురికి 18 నెలల జైలు శిక్షతోపాటు రూ.2,500 జరిమాన విధించినట్లు సీఐ తెలిపారు.

Updated Date - Dec 19 , 2024 | 11:12 PM