కర్షకుడికి కష్టాలు
ABN , Publish Date - Nov 14 , 2024 | 11:21 PM
ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రా ల్లో ప్రతీ ఏటా రైతులకు కష్టాలు తప్పడం లేదు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- ధాన్యం ఆరబోసేందుకు స్థలాలు కరువు
- ఆపత్కాలంలో భద్ర పరిచేందుకు తప్పని తిప్పలు
- కొనుగోళ్లపైనే అధికారుల శ్రద్ధ
- రైతుల కష్టాలు తీరేనా ?
పెబ్బేర్ రూరల్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రా ల్లో ప్రతీ ఏటా రైతులకు కష్టాలు తప్పడం లేదు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టార్ఫాలిన్లు అందించ కపోవడం, ధాన్యం ఆరపోసుకోవడానికి స్థలాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అధికారు లు ధాన్యం కొనుగోలు చేయటంపైనే దృష్టి సారిం చారే తప్ప రైతుల ఇబ్బందులను తొలగించే అం శాలపై చర్యలు తీసుకోవడంలేదని ఆన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల కు ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు తీసుకొస్తారు? ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలి, సన్న రకం ధాన్యాన్ని గుర్తించేందుకు పరికరాల వినియోగం వంటి వాటిపై అధికారులు దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా పీఏసీఎస్, ఐకేపీ, మెప్మా ఆధ్వర్యంలో 244 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్ధం చేశారు.
సమస్యలపై దృష్టి సారించాలి..
గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పా టుకు ముఖ్యంగా స్థలాల కొరత రైతులను వేధి స్తుంది. ఉన్న స్థలంలో ధాన్యం ఆరబోసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రైతులు ఇళ్ల ముందు, రహదారులపై ధాన్యం ఆరబోసుకుం టున్నారు. అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మొక్కుబడిగా కేంద్రాలను ఏర్పాటు చేసి చేతులు దులుపుటుకుంటున్నారు. కేంద్రాల్లో టార్ఫాలిన్ కవర్లు లేక వర్షానికి, రైతు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది కూడా టార్ఫాలిన్ కవర్లు అందించండం లేదు. ప్రతీ ఏటా గోనెసంచుల కొరతతో వారాల తరబడి ధాన్యాన్ని తూకం చేయకుండా కేంద్రాల్లో నే నిల్వ ఉంచుతున్నారు. మరో పక్కన లారీల కొ రత కారణంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతున్నది. తడిన ధాన్యం మిల్లర్లు తిరస్కరిస్తున్నారు. కేంద్రాల్లో ధాన్యం తూకం చే యుటకు నిర్వాహకులు తేమ శాతాన్ని పరిశీలిస్తా రు. సన్నరకం 14 శాతం, దొడ్డు రకం 17 శాతం తేమ ఉంటేనే తూకం చేస్తారు. అలాంటిది తూకం చేసిన ధాన్యాన్ని లారీలకు ఎత్తే మిల్లర్ల దగ్గరకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉందని మిల్లుల దగ్గర ధాన్యాన్ని దించుకోకుండా లారీలను తిరిగి కొనుగోలు కేంద్రాలకు పంపిస్తు న్నారు. తరుగు తీస్తేనే ధాన్యం మిల్లుల దగ్గర దించుకుంటామని మిల్లర్లు చెప్పడంతో తరుగు తీస్తున్నారు. అధికారులు కూడా మిల్లర్లకే మద్దతు పలుకుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేఉ్తన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాల వద్ద ఐదుగురు నిర్వాహకులు ఉండాలి. కేవలం ఒకరిద్ధరితోనే కొనుగోలు చేస్తున్నారు. దీంతో ధాన్యం సేకరణ ఆలస్యమవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో తూకం చేసి నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు గత సీజన్‌లో చోరీకి గురయ్యాయి. ఆ నష్టాన్ని రైతులపైనే నెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.