Share News

హరితహారం లక్ష్యం చేరుకోవాలి

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:00 PM

ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా మండలానికి నిర్ధేశిం చిన వందశాతం లక్ష్యం చేరుకోవాలని మండల ప్రత్యేకాధికారి డీఆర్డీవో ఉమాదేవి అన్నారు.

హరితహారం లక్ష్యం చేరుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఉమాదేవి

- డీఆర్డీవో ఉమాదేవి

పాన్‌గల్‌, జూలై 26 : ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా మండలానికి నిర్ధేశిం చిన వందశాతం లక్ష్యం చేరుకోవాలని మండల ప్రత్యేకాధికారి డీఆర్డీవో ఉమాదేవి అన్నారు. శుక్రవారం పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్య దర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతీ ఒక్క రు మొక్కలు నాటేలా ప్రోత్సహించాలని సూచించారు. రోడ్డుకు ఇరువైపులా విరివిగా మొక్కలు నాటాలని అన్నారు. అదేవిధంగా అవసరమున్న రైతులను గుర్తించి మామిడి, కొబ్బరి మొక్కలు పంపిణీ చేయాలని సూచించారు.

మహిళా సంఘాలను ప్రోత్సహించాలి..

ప్రభుత్వం మహిళా సంఘాలకు కల్పిస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకొని ఆర్థికంగా బలపడేలా ప్రోత్సహించాలని డీఆర్డీవో పీడీ ఉమాదేవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో విలేజ్‌ బుక్‌ కీపర్లు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం కోసం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందుకు నూ తన సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి తీసుకునే రుణాలను వినియోగించుకొని ఆర్థికంగా బలపడి సకాలంలో రుణాలు చెల్లించాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాల్లో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. సమా వేశంలో ఎంపీవో రఘురాం, ఏపీవో కుర్మయ్య, ఏపీఎంలు చైతన్య, సక్రునాయక్‌, సీసీ నాగరాజు తదితరులున్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:00 PM