Share News

హోం మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలి

ABN , Publish Date - Dec 23 , 2024 | 11:48 PM

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వెంటనే రాజీనామా చేయాలని, లేదంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనను భర్తరఫ్‌ చేయాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

హోం మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సంపత్‌కుమార్‌, చిత్రంలో సరిత

- ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ డిమాండ్‌

- నేడు గద్వాల పట్టణంలో భారీ ర్యాలీ

గద్వాల, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వెంటనే రాజీనామా చేయాలని, లేదంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనను భర్తరఫ్‌ చేయాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. జోగు ళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని హరిత హోటల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, జడ్పీ మాజీ చైర్‌ పర్సన్‌ సరితతో కలిసి మాట్లాడారు. రాజ్యాంగంపై, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌పై అమిత్‌ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం దేశంలోని 29 రాష్ట్రాల్లో ర్యాలీ లు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా గద్వాల పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తామని చెప్పారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో పాటు పార్టీ మండలాల అధ్యక్షులు, బాధ్యులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో అలంపూర్‌ మార్కెట్‌ చైర్మన్‌ దొడ్డప్ప, టీపీసీసీ సభ్యుడు గంజిపేట శంకర్‌, పట్టణ అధ్యక్షుడు ఇసాక్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నల్లారెడ్డి, నాయకులు శ్రీనివాస్‌ గౌడ్‌, ఇస్మాయిల్‌, మాల మహానాడు నాయకుడు శ్రీనివాసులు, కబీర్దాస్‌ నర్సింహులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 11:48 PM