హుండీ ఆదాయం రూ.79.68 లక్షలు
ABN , Publish Date - Dec 02 , 2024 | 11:33 PM
మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ సమీపంలోని కురుమూర్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి రూ. 79,68,810 ఆదాయం సమకూరింది.
కురుమూర్తిలో గత ఏడాది కంటే రూ.13,63,639 అధికం
చిన్నచింతకుంట, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ సమీపంలోని కురుమూర్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి రూ. 79,68,810 ఆదాయం సమకూరింది. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో మొదటి సారి హుండీ లెక్కించగా రూ.25,54,805, రెండోసారి లెక్కింపులో రూ.22,78,894, మూడో సారి సోమవారం లెక్కింపులో రూ.31,35,111 ఆదాయం సమకూరింది. మూడుసార్లు కలిపి మొత్తం రూ.79.68 లక్షల ఆదాయం వచ్చింది. గత ఏడాది రూ.66,5,000 ఆదాయం వచ్చింది. గత సంవత్సరం కంటే రూ.13,63,639 ఎక్కువ ఆదా యం వచ్చింది. ఈవో మదనేశ్వర్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, దేవాదాయ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు, పాలక సభ్యులు పాల్గొన్నారు.